Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం పూట లంచ్ టైమ్‌లో వేపుళ్ళు వద్దు.. కంప్యూటర్లతో చర్మ సమస్యలు?

లంచ్ టైమ్‌లో తీసుకునే ఆహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారంలో నూనె ఉండకుండా చూసుకోవాలి. అందుకే వేపుళ్లు తీసుకోకూడదు. వాటివల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. పనిచేయడానికి ఇబ్బందిక

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:02 IST)
లంచ్ టైమ్‌లో తీసుకునే ఆహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారంలో నూనె ఉండకుండా చూసుకోవాలి. అందుకే వేపుళ్లు తీసుకోకూడదు. వాటివల్ల కడుపులో గ్యాస్‌ ఏర్పడుతుంది. పనిచేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని పండ్ల ముక్కలను వెంట తెచ్చుకుంటే సాయంత్రం స్నాక్స్‌కు బదులు అల్పాహారంగా తీసుకోవచ్చు. వాటి నుంచి పోషకాలు అందుతాయి. సులభంగా జీర్ణమవుతాయి కూడా.
 
అలాగే కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. దానివల్ల కళ్లు అలసటకు గురికాకుండా ఉంటాయి. ఇదో చక్కటి వ్యాయామం. కంప్యూటర్ల వల్ల శరీరానికి రేడియేషన్‌ ప్రభావం ఎక్కువగా ఉండి చర్మం పొడిబారుతుంది. అందుకని సన్‌స్క్రీన్‌ లోషన్‌ వెంట పెట్టుకొంటే రెండుమూడు గంటలకోసారి రాసుకొంటే సరిపోతుంది. ఎలాంటి చర్మ సంబంధిత సమస్యలు రావు.
 
రాత్రి ఎనిమిది గంటలలోపే డిన్నర్‌ చేయడం ఉత్తమం. లేట్‌గా తింటే తొందరగా నిద్రపట్టదు. రాత్రి సమయంలో ఎక్కువ నీళ్లు తాగకూడదు. అంతేకాదు రాత్రి సమయంలో ఎక్కువగా టీవీ చూస్తే కళ్లు ఒత్తిడికి గురవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments