Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఖర్బూజ జ్యూస్ తాగితే...

Webdunia
మంగళవారం, 11 మే 2021 (22:51 IST)
వేసవి దాహార్తిని తీర్చే పండ్లలో ఖర్బూజ కూడా ఒకటి. ఈ పండులో ఎక్కువ శాతం బీటాకెరోటిన్, విటమిన్ సి ఆరోగ్యానికి తోడ్పడి క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తుంది. దీనిలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు శరీరంలోని తెల్ల రక్త కణాలను వృద్ది చెందేలా చేసి రక్తంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
 
ఖర్బూజ పండులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కంటి సంబందిత సమస్యలను దూరం చేసి కంటి చూపు బాగా ఉండేలా చేస్తుంది.. వడదెబ్బ నుండి రక్షిస్తుంది. ఖర్బూజ పండులో విటమిన్ కె మరియు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పని చేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా జరిగేలా ఉపయోగపడుతుంది.
 
ఖర్బూజ పండులో పొటాషియం ఉండడం వలన గుండెకు మంచి న్యూట్రియన్స్‌ని అందజేస్తుంది. దీనిలో ఫోలెట్ ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ఖర్బూజలో తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువగా పీచు పదార్థం ఉండటం వలన అధిక బరువుని తగ్గిస్తుంది. 
 
ఖర్బూజ జ్యూస్ తాగడం వలన మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఈ జ్యూస్‌ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments