Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొలకొచ్చిన వెల్లుల్లి తింటే ఏమవుతుంది?

వెల్లుల్లిపాయల నుంచి మొలకలు రాగానే వాటిల్లో ఇంకేమీ సారం లేదని చెత్తలో పారేస్తారు. కానీ మొలకొచ్చిన వెల్లుల్లిలో తాజా వాటికన్నా గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మరింత క్రియాశీలకంగా వుంటాయని నిపుణులు చెపుతున్నారు. లేతగా వుండే పాయలు, కాస్త ముదిరిన పా

Webdunia
మంగళవారం, 13 జూన్ 2017 (21:51 IST)
వెల్లుల్లిపాయల నుంచి మొలకలు రాగానే వాటిల్లో ఇంకేమీ సారం లేదని చెత్తలో పారేస్తారు. కానీ మొలకొచ్చిన వెల్లుల్లిలో తాజా వాటికన్నా గుండెకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు మరింత క్రియాశీలకంగా వుంటాయని నిపుణులు చెపుతున్నారు. లేతగా వుండే పాయలు, కాస్త ముదిరిన పాయలతో పోల్చితే ఇలా మొలకొచ్చిన పాయల్లోనే రకరకాల మెటాబొలైట్లు వున్నట్లు గుర్తించారు. 
 
సాధారణంగా ఇలాంటి పదార్థాలు గింజల మొలకల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. మొక్కలుగా మారే దశలో ఆయా మొలకలు వ్యాధుల బారిన పడకుండా ఈ మెటాబొలైట్లు రక్షిస్తాయి. దీని ఆధారంగా మొలకలొచ్చిన వెల్లుల్లిలో కనిపించే ఈ పదార్థాలు కూడా అద్భుత యాంటీ ఆక్సిడెంటల్లా పనిచేస్తాయని అంటున్నారు. అంతేకాదు...  ఐదు రోజుల వెల్లుల్లి మొలకలు తాజా రెబ్బలూ లేత రెబ్బలకన్నా ఎక్కువగా గుండెకు మేలు చేస్తాయని చెబుతున్నారు. 
 
ఎందుకంటే మామూలుగానే వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్నది తెలిసిందే. కొలెస్ట్రాల్‌ని బీపీని తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధిని అడ్డుకుంటుంది. మొత్తంగా రోగనిరోధకశక్తిని పెంపొదిస్తుంది. అయితే మొలకలొచ్చిన వెల్లుల్లితో మరెన్నో లాభాలున్నాయని పరిశోధనలు చెపుతున్నాయి.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments