తులసి ఆకుల పేస్ట్, ఉప్పు జతచేస్తే..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (10:35 IST)
చలికాలంలో వచ్చే జలుబు కారణంగా పలురకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో పాటు ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. ఎక్కువగా చెప్పాలంటే.. జలుబు సమస్య ఎక్కువగా వేధిస్తుంది. ఈ జలుబును తగ్గించడానికి వైద్య చికిత్సలు తీసుకుని రకరకాల మందులు వాడుతుంటారు. వీటిని వాడడం వలన సమస్య మరింత పెరిగే ప్రమాదం ముందని చెప్తున్నారు. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
.
 
1. కప్పు నీళ్లల్లో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
2. గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా కుంకుమ పువ్వు, జాజికాయ చూర్ణం కలిపి మరిగించి చల్లారిన తరువాత తీసుకుంటే జలుబు, ఇతర వ్యాధులు కూడా తొలగిపోతాయి. 
 
3. ప్రతిరోజూ మీరు తీసుకునే పాలలో కొద్దిగా పసుపు కలిపి తీసుకుంటే జలుబు వెంటనే తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు. 
 
4. సాధారణంగా చాలామంది వేనీళ్లు అంతగా తాగరు. దీని కారణంగానే పలురకాల అనారోగ్యాలా పాలవుతున్నారు. రోజూ గ్లాస్ వేనీళ్లు తీసుకోవడం వలన గొంతునొప్పి, తలనొప్పి వంటి సమస్యలుండవు. 
 
5. తులసి కోట ప్రతి ఇంట్లో ఉంటుంది.. కాబట్టి కొన్ని తులసి ఆకులను పేస్ట్‌లా చేసి అందులో కొద్దిగా ఉప్పు కలిపి తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తే.. జలుబు తగ్గుముఖం పడుతుంది. లేదా తులసి టీ తీసుకున్నా మంచిదే.
 
6. తమలపాకుల రసంలా చేసి అందులో లవంగాల పొడి, అల్లం రసం, తేనే లేదా చక్కెర కలిపి సేవిస్తే జలుబు తగ్గుతుంది. మిరియాలను నెయ్యిలో వేయించి పొడిచేసి పాలలో కలిపి తాగితే అనారోగ్యాలు దరిచేరవు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుతిన్ కోసం 40 నిమిషాలు వేచి చూస్తూ గోళ్లు కొరుక్కున్న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్

వ్యక్తి భుజం పైకి ఎగిరి పళ్లను దించిన వీధికుక్క (video)

నా డబ్బు నాకు ఇచ్చేయండి, ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి డిమాండ్ (video)

మధ్యాహ్నం భోజనం కలుషితం... ఆరగించిన 44 మంది విద్యార్థుల అస్వస్థత

పవన్ సార్... మా తండాకు రహదారిని నిర్మించండి.. ప్లీజ్ : దీపిక వినతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments