Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బో... విపరీతమైన కొవ్వు... ఏం చేయాలి...?

గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ప్రధాన కారణం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదమున్న ఈ సమస్యను చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ ముప్పును తప్

Webdunia
బుధవారం, 13 జులై 2016 (14:20 IST)
గుండె జబ్బులు రావడానికి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం ప్రధాన కారణం. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదమున్న ఈ సమస్యను చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ ముప్పును తప్పించుకోవాలంటే క్రమంతప్పకుండా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉంది, కొలెస్ట్రాల్ వల్ల ముప్పు ఏర్పడే అవకాశం ఉందా అనే విషయాలు తెలుస్తాయి. పై అంతస్తుకు వెళ్లాలనుకుంటే లిఫ్ట్‌ను ఉపయోగించకండి. మెట్లను ఉపయోగించండి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడానికి ఇది మంచి మార్గం. శారీరక వ్యాయామం కోసం నడక చాలా మంచిది. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. 
 
* ప్రతిరోజు కనీసం అరగంట పాటు క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి వ్యాయామం బాగా ఉపకరిస్తుంది.
మాంసాహారం బదులుగా చేపలు తీసుకోవచ్చు. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. దీనిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. కాబట్టి వారంలో రెండు, మూడుసార్లు చేపను ఆహారంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అదుపులో ఉండటానికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది.
* మాంసాహారం తక్కువగా తినాలి. మాంసాహారం ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అందుకే మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి.
 
* ప్రతిరోజు తీసుకునే ఆహారంలో 5 నుంచి 10 గ్రాముల ఫైబర్(పీచు పదార్థాలు) ఉండేలా చూసుకోవాలి. ఉదయపు అల్పాహారంలో ఓట్‌మీల్ తీసుకోవడం, కూరగాయలు ఎక్కువగా తినడం చేయాలి.
* సాయంత్రం సమయంలో ఆకలిగా ఉన్నట్లయితే నట్స్ తీసుకోండి. మిర్చి బజ్జీకి బదులుగా నట్స్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. కడుపు కూడా నిండుతుంది.
* బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉంటే కొలెస్ట్రాల్ స్థాయి నార్మల్‌గా ఉంటుంది. అధిక బరువుతో బాధపడే వారిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది.
 
* తక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశాలు తగ్గిపోతాయి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకుంటే కొవ్వు దరిచేరకుండా ఉంటుంది.
* నూనె వాడకం బాగా తగ్గించాలి. ఆలివ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటి అన్‌శాచురేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్‌ను వాడితే మరీ మంచిది.
* రెగ్యులర్ టీకి బదులుగా గ్రీన్ టీ తాగండి. గ్రీన్ టీ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది.
 
* మెనూలో కూరగాయాల భోజనం ఉండేలా చూసుకోండి. వివిధ రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి.
* వెల్లుల్లిలో ఆర్గనో సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొవ్వు శాతం పెరగకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, కొలెస్ట్రాల్‌ను కాలేయానికి రవాణా చేస్తుంది. అందుకే రోజు రెండు మూడు రెబ్బల వెల్లుల్లి తీసుకోవ‌డం ఆరోగ్యానికి చాలా మంచిది.
* అవిసెలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించుకోవచ్చు. అవిసెల్లో(ఫ్లాక్స్ సీడ్) ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
 
* రోజుకు సరిపడా సమయం నిద్రపోవాలి. మంచి నిద్ర వల్ల శరీరం తిరిగి పునరుత్తేజం అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటేన్ అవుతాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కొలెస్ట్రాల్ ముప్పు తప్పుతుంది.
* కొలెస్ట్రాల్ సంబంధిత సమస్యలతో పాటు అనేక సమస్యలకు మూల కారణం స్మోకింగ్. పొగతాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి స్మోకింగ్‌ను మానేయడం మంచిది.
* రోజూ కార్డియో ఎక్సర్‌సైజులు చేయడం వ‌ల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కొలెస్ట్రాల్‌తో వచ్చే ముప్పుకు చెక్ పెట్టవచ్చు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments