కాలేయాన్ని కాపాడుకోండి.. లేకుంటే ఇబ్బందులే..?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (12:50 IST)
గుండెతోపాటు మన శరీరంలో ముఖ్యంగా కాపాడుకోవాల్సిన అవయవం కాలేయం. జీర్ణక్రియలో ముఖ్య పాత్ర పోషించే ఈ అవయవాన్ని ఎంతో జాగ్రత్తగా రక్షించుకోవాలి. లేకుంటే ప్రాణాల మీదకు వచ్చే అవకాశం కూడా ఉంది. సరైన ఆహారం తీసుకోకపోవడం, తరచూ బయట తినడం, అతిగా తినడం, నూనెతో చేసిన పదార్థాలను అధికంగా తినడం, మద్యం అలవాటు ఇలా చాలా కారణాల వల్ల లివర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువ. 
 
లివర్ డ్యామేజ్ అయితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే లివర్ పాడవకుండా మనం రక్షించుకోవచ్చు. అవేంటో చూద్దాం.  రాత్రి పూట త్వరగా పడుకుని ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివ‌ర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవ‌చ్చు. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. 
 
అంతేకాకుండా ఉదయం అల్పాహారం తీసుకోవడం అసలు మానేయకూడదు. లేదంటే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఆహారం ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టడమే కాకుండా లివర్‌పై అధిక భారం పడుతుంది. కొద్దికొద్దిగా అప్పుడప్పుడూ ఆహారం తీసుకుంటే మంచిది. వైద్యుల సలహా లేకుండా మనకిష్టమొచ్చినట్లు మందులు వాడినా లివర్ చెడిపోతుంది. 
 
డాక్టర్‌లు సూచించిన మోతాదులలో మాత్రమే మందులు వాడాలి. కలుషితమైన నూనెతో చేసిన ఆహారాన్ని తిన్నాకూడా కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. రిఫైన్డ్ ఆయిల్ వాడటం శ్రేయస్కరం. మద్యానికి బానిసైన వారిలో కూడా చాలా మందికి లివర్ పాడైపోతుంది. సాధ్యమైనంత వరకూ మద్యానికి దూరంగా ఉండటమే మంచిది. ఆహారాన్ని బాగా ఉడికించి తినాలి. పచ్చిపచ్చిగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే అది జీర్ణమవదు లివర్‌పై భారం పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నీట్ ప్రవేశ పరీక్ష ఆధారంగానే బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలు

నాలుగు స్థానాల్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ - 13 చోట్ల సింగిల్ డిజిట్

వడ్డేపల్లి మున్సిపాలిటీ గెలుపుతో కవితకు సంబంధం లేదు : ఇండియా ఫార్వర్డ్ బ్లాక్

Lucknow: హిట్ అండ్ రన్ కేసు.. ఆరేళ్ల చిన్నారి మృతి.. ఐదుగురికి గాయాలు

ప్రాజెక్ట్ జల శక్తిని ప్రారంభించిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ రికార్డ్ క్రియేట్ చేసిన మన శంకరవర ప్రసాద్ గారు

Srivishnu: విష్ణు విన్యాసం లో శ్రీ విష్ణు, నయన సారిక ల లవ్లీ కెమిస్ట్రీ

Jagapathi Babu: డబ్బంటే పిచ్చి వుంటే అది జబ్బు : జగపతిబాబు

డిస్ట్రిబ్యూటర్లతోపాటు ప్రేక్షకుడూ హ్యాపీ అయ్యేలా ఫంకీ వుంది : సూర్యదేవర నాగవంశీ

వారణాసి సైన్స్ ఫిక్షన్ ఫీల్ కనిపిస్తున్నా... ఎస్.ఎస్.రాజమౌళి క్లారిటీ

తర్వాతి కథనం
Show comments