Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భాశయ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టాలంటే.. ఈ ఫుడ్స్ తీసుకోవాల్సిందే!

Webdunia
గురువారం, 17 మార్చి 2016 (10:19 IST)
గర్భాశయ క్యాన్సర్‌‌కు అధిక రక్తస్రావం, నెలసరి సమయాల్లో కడుపునొప్పి, నెలసరి ముగిసినా శరీర బరువు పెరగడం వంటివి లక్షణాలు. వంశపారంపర్యంగానూ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. హార్మోన్ రీప్లేస్‌మెంట్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అధికంగా ఉంది. ఇంకా శరీరంలో చక్కెర శాతం పెరిగినా, బరువు పెరిగినా గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
అయితే గర్భాశయ క్యాన్సర్‌ను దూరం చేసుకోవాలంటే రక్తంలో చక్కెర శాతాన్నితగ్గించాలి. కాయగూరలను అధికంగా తీసుకోవాలి. పచ్చిబఠాణీలను ఆహారంలో చేర్చుకోవాలి. రోజూ పండ్లు తినాలి. మూకుడులో ఉడికించిన పదార్థాలు తీసుకోవచ్చు. కానీ పీచు పదార్థాలు అధికంగా ఉండేవి తీసుకోకూడదు. కాయగూరల్లో క్యాబేజీ, కాలిఫ్లవర్, మొలకెత్తిన విత్తనాల తీసుకోవచ్చు. వీటిలోని ఇంటెల్ త్రీ కార్బన్‌తో కేన్సర్‌ను పుట్టించే క్రిములను నశింపజేయవచ్చు. 
 
అలాగే పసుపు, ఎరుపు రంగు పండ్లను అధికంగా తీసుకుంటూ ఉండాలి. వీటిద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఆపిల్, నిమ్మపండు, టమోటా, బత్తాయి పండ్లలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అలాగే బాదం, పిస్తా వంటి నట్స్ కూడా తీసుకోవచ్చు. మాంసాహారంలో చేపలు వేపుడు రూపంలో గాకుండా ఉడికించిన అంటే కూరలను తీసుకోవచ్చు. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గర్భాశయ కేన్సర్‌ను దూరం చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments