Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్‌రూట్ జ్యూస్‌ను రుచికరంగా ఇలా చేసుకోవచ్చు

Webdunia
గురువారం, 21 మే 2020 (21:37 IST)
బీట్‌రూట్ చూడటానికి ఎర్రగా ఉన్నట్లుగానే రక్తం వృద్ధి కావడానికి చాలా దోహదపడుతుంది. బీట్‌రూట్‌ను ఏ రూపంలో తీసుకున్నా సరే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు బీట్‌రూట్‌ను తీసుకుంటే చాలా త్వరగా కోలుకుంటారు. ఐర‌న్ తక్కువగా ఉండటం వలన రక్తహీనత ఏర్పడుతుంది. 
 
అలాంటప్పుడు బీట్‌‌రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్‌లో పాటుగా రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఎప్పుడూ నీరసంతో బాధపడేవారు బీట్‌రూట్ జ్యూస్ తాగినా, ముక్కలు తిన్నా వెంటనే శక్తి పుంజుకుంటారు. ఇందులో విటమిన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి, కనుక బీపీ, గుండె జబ్బులు దరి చేరవు. ఒంట్లోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటుగా మానసిక స్థితి, జ్ఞాపక శక్తిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇక గర్భిణులు క్రమం తప్పకుండా ఈ జ్యూస్ తీసుకుంటే పిండం ఎదుగుదల బాగుంటుంది.
 
బీట్‌రూట్ ముక్కలు తినడం కష్టంగా ఉన్నవారు ఈ విధంగా రుచికరమైన జ్యూస్ చేసుకుని తాగొచ్చు. ముందుగా బీట్‌రూట్ తొక్క తీసుకుని, చిన్న ముక్కలుగా చేసుకుని, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కలిపి, కాస్త పాలు వేసుకుని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. దీన్ని వడగట్టుకోవాలి. ఆ జ్యూస్‌లో కాస్త నిమ్మరసం పిండుకుని, కాస్త చక్కెర యాడ్ చేసుకోవాలి. అంతేనండి చాలా సింపుల్‌గా క్షణాల్లో అయిపోతుంది.

సంబంధిత వార్తలు

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments