Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రిజ్ ఉంది సరే... దాన్ని ఎలా వాడుతున్నారు...? ఎలా వాడుకోవాలంటే...

Webdunia
శనివారం, 2 ఏప్రియల్ 2016 (18:09 IST)
ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. మనం రోజూ ఫ్రిజ్‌లో అనేక పదార్థాలను నిల్వ ఉంచి ఆ తర్వాత వాడుకోవచ్చు అనుకుంటాము. కానీ దానికీ పరిమితులున్నాయి. క్యాన్సర్ కారక రసాయనాలు ఉద్భవించకుండా, ఆహార పదార్ధాలు విషతుల్యాలుగా మారకుండ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రిఫ్రిజరేటర్ వాడకంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం మన్నుతుంది. కరెంటు ఖర్చు కూడా తగ్గుతుంది.
 
* ఆఖరి దశలో ఉన్న పదార్థాలను ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టరాదు. పదార్థాలు చెడిపోయే తరుణంలో బాక్టీరియా వృద్ధి చెంది ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.
* ఫ్రిడ్జ్‌లో పెట్టిన పదార్థాలకు మూతలు తప్పక పెట్టాలి. పదార్థాలు ఉంచిన పాత్రల మూతలు తీసివేయరాదు. అనేక పదార్థాల వాసనలు కలిసిపోయి విషవాయువులు తయారవుతాయి.
* మెటాలిక్ పాత్రలు వాడకూడదు. రసాయనిక చర్య మూలంగా పదార్థాల రుచిమారవచ్చు. ప్లాస్టిక్ పాత్రలు వాడటం మేలు
*ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలను ఎప్పటిలోగా తిరిగి ఉపయోగించుకోవాలన్నది తెలుసుకోవాలి. ఫ్రిజ్లోనే కదా అని పదార్థాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకండి. ఫ్రిజ్లో పెట్టినంత మాత్రాన అవి చాలా రోజులు పాడవకుండా ఉంటాయనుకోవడం భ్రమ మాత్రమే. కరెంట్ పోయిన సందర్భాలు ఉంటాయి. 
*గాజు, ప్లాస్టిక్ పాత్రలలో పదార్థాలు, ద్రవాలకు పైమూతలు ఉంచి నిల్వ చేస్తే మంచిది.
*ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలను బయటకు తీసి, వేడి చేసి వాడినచో మరలా అదే పదార్థాన్ని ఫ్రిజ్‌లో దాచి మరోసారి వాడాలనే తలంపు మంచిది కాదు.
* ఫ్రిజ్లో చిందిన పదార్థాలు, గడ్డకట్టిన ఐస్ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే లోపల ఉన్న పదార్థాలు విషపూరితం కాకుండా జాగ్రత్తపడవచ్చు.
* వేడి పదార్థాలను చల్లారిన తర్వాతే ఫ్రిజ్లో పెట్టాలి. అతివేడివి పెడితే లోపల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులూ పెరుగుతాయి.
* తలుపును ఎక్కువసేపు తెరిచి ఉంచితే ఫ్రిజర్ లోపల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి.
* ఒకసారి డీప్ ఫ్రీజర్లోంచి తీసిన పదార్థాలను తిరిగి ఫ్రీజర్లో ఉంచొద్దు. ఒకసారి బయటపెట్టిన ఆహారంపై బ్యాక్టీరియా పెరగడం ప్రారంభం అవుతుంది. దాన్ని మళ్లీ లోపల పెడితే ఆ బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. అందువల్ల అవసరమైనంతవరకు తీసుకుని మిగిలింది లోపలే ఉంచాలి.
* నీటి పరిమాణం ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి వాటిని సిల్వర్ ఫాయిల్లో ఉంచాలి. లేకపోతే నీరు అంతాపోయి, ఎండిపోవడమే కాక పోషక విలువలు కూడా మాయం అవుతాయి.
* ఫ్రిజ్ యొక్క ఇంజన్ కూడా విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి, రేడియేషన్‌కు కారణం అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్రిజ్‌లో పదార్థాలు విషతుల్యాలుగా మారతాయి.
* ఫ్రిజ్లో సామర్థ్యానికి మించి ఎక్కువ వస్తువులు పెట్టకూడదు. 
* పికెల్స్, క్రీమ్స్ వంటి వాటి ఎక్స్‌పైరీ డేట్ చూసుకొని పనికిరాని పారవేయడం వంటివి అప్పుడప్పుడూ చేస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.
* ఫ్రిజ్‌లో నిలువ ఉంచిన పదార్థాలు చిన్న పిల్లలకు పెట్టడం వీలైనంత తగ్గించాలి.
* రేడియట్ హీట్‌కి సంబందించిన వాటిని( ఉదా: స్టవ్, వాటర్ హీటర్)ఫ్రిజ్‌కి దూరంగా ఉంచాలి.
* ఫ్రిజ్ యొక్క ఇంజన్ కూడా విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టించి, రేడియేషన్‌కు కారణమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్రిజ్‌లో పదార్థాలు విషతుల్యాలుగా మారతాయి. 
* ఫ్రిడ్జ్ వెనకాల ఎవాపరేట్ బాక్స్‌లోని నీరు తీసేటపుడు తప్పనిసరిగా కరెంట్ చెక్ చేయాలి లేదంటే కొన్ని సందర్భాలలో షాక్‌కి గురయ్యే ప్రమాదం ఉంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రిన్సిపాల్ గదిలోనే దళిత బాలికపై అత్యాచారం.. ఆన్‌‌లైన్‌లో వీడియో

Snakes: ఆ చెట్టు నిండా పాములే.. కొమ్మకు కొమ్మకు కొండ చిలువలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

Vaibhavam : అవ్యాజ్యమైన అమ్మ ప్రేమ తో వైభవం సిద్ధమైంది

మొదటి చాన్స్ ఇచ్చిన దర్శకుడితో ఎస్ సినిమా చేయడం హ్యాపీ : విజయ్ సేతుపతి

వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్

Show comments