ఆకుకూరల్ని కుక్కర్లో మూతపెట్టి వండుతున్నారా?

రోజూ ఓ కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఆకుకూరల ద్వారా అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఆకుకూరల్లో కెలోరీలు, కొ

Webdunia
శుక్రవారం, 14 జులై 2017 (17:37 IST)
రోజూ ఓ కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఆకుకూరల ద్వారా అనేక రకాల ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. ఆకుకూరల్లో కెలోరీలు, కొవ్వు తక్కువ. అయితే ఈ ఆకుకూరలను వండేటప్పుడు రెండు మూడుసార్లు కడగాలి. ఎందుకంటే.. చిన్న పురుగులు, దుమ్ము, వంటివి తొలగిపోతాయి. 
 
కడిగేటప్పుడు పావు స్పూన్ ఉప్పు వేసి శుభ్రం చేస్తే ఇంకా మంచిది. ఇలా చేయడం ద్వారా క్రిములు చనిపోతాయి. అలాగే ఆకుకూరలను వండే సమయంలో మూతలు పెట్టి వండటం ద్వారా మనకు పూర్తి పోషకాలు లభిస్తాయి. వీలైనంతవరకు కుక్కర్లో వండటం మంచిది. ఆకుకూరలు ఉడికించిన తర్వాత ఆ నీటిని పారేయకుండా ఉప్పు, నిమ్మరసం కలిపి సూప్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
 
ఆకుకూరల్లో రోజుకో రకం బచ్చలి, మెంతికూర, కొత్తిమీర, కరివేపాకు, తోట కూర, కొయ్యతోటకూర, అవిశాకు, మునగాకు, గోంగూర, చింతచిగురు, పొన్నగంటి, పాలకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయాకాలంలో చౌకగా దొరికే ఆకు కూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. 
 
పెసర పప్పు, పాలకూర, కరివేపాకు పొడి, పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, ఆకుకూర పకోడి, బచ్చలి-బజ్జి వంటి వెరైటీలుగా ఆకుకూరల్ని ఆహారంలో చేర్చుకోవచ్చు. క్యాల్షియం, విటమిన్‌ ‘ఎ', ‘సి', ఇనుము, ఫోలిక్ యాసిడ్ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

తర్వాతి కథనం
Show comments