Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి ముక్కలపై కాస్త ఉప్పు చల్లుకుని తింటే..?వడదెబ్బ తగిలితే?

వేసవి కాలంలో మామిడి కాయలు విరివిగా లభిస్తాయి. వీటిని తినడం ద్వారా డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవిలో చెమటలు ఎక్కువగా పడతాయి. ఫలితంగా ఇనుము, సోడియం క్లోరైడ్ వంటి శరీ

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2017 (11:27 IST)
వేసవి కాలంలో మామిడి కాయలు విరివిగా లభిస్తాయి. వీటిని తినడం ద్వారా డీహైడ్రేషన్‌ను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వేసవిలో చెమటలు ఎక్కువగా పడతాయి. ఫలితంగా ఇనుము, సోడియం క్లోరైడ్ వంటి శరీరం నుంచి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే.. మామిడి ముక్కలు పచ్చిగా తీసుకోవడం మంచిది. 
 
మామిడి ముక్కలపై కాస్త ఉప్పు చల్లుకుని తింటే.. శరీరం నీటి శాతాన్ని కోల్పోదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  పచ్చిమామిడిలో ఉండే విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇవి పండులో కన్నా పచ్చిదానిలోనే ఎక్కువని వారు చెప్తున్నారు. మామిడి ముక్కలు తినడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శరీరంలోని కణాలను పునరుద్ధరించడంలో ఇందులోని పోషకాలు దోహం చేస్తాయి. రక్తహీనత కూడా అదుపులో ఉంటుంది. 
 
అలాగని అతిగా మాత్రం తీసుకోకూడదు. వడదెబ్బ తగిలినప్పుడు పచ్చిమామిడి రసాన్ని మరిగించి తీసుకోవాలి. ఇది నీరసాన్నీ, అలసటనూ తొలగిస్తుంది. సమస్య నుంచి త్వరగా కోలుకోవడానికి దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments