Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి గట్టెక్కాలంటే.. ఇవి తినాల్సిందే..?

Webdunia
గురువారం, 14 మే 2020 (15:02 IST)
కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఇందులో భాగంగా ఆహారంలో తాజాపండ్లు, కూరగాయలను తప్పక తీసుకోవాలి. రంగు రంగుల కూరగాయలు, పండ్లలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ, క్యారెట్, ఆకుకూరలు తీసుకోవాలి. ఇంకా ఒమేగా-3 సమృద్ధిగా వుండే చేపలను తీసుకోవాలి. 
 
విటమిన్ బి కలిగిన పుడ్స్ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పాల ఉత్పత్తులు, పిల్లలకు విటమిన్ డి ఎక్కువగా ఆహారం ఇవ్వడం చేయాలి. ఫాస్ట్ ఫుడ్స్, రెస్టారెంట్ల ఫుడ్‌కు దూరంగా వుండాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను పిల్లలకు అలవాటు చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
తుల‌సి, దాల్చిన చెక్క‌, న‌ల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొద‌లైన‌వాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒక‌సారిగానీ, రెండుసార్లుగానీ తాగడం చేయాలి. అవ‌స‌ర‌మ‌నుకుంటే బెల్లం లేదా తాజా నిమ్మ‌ర‌సాన్నిక‌లుపుకోవచ్చు. పసుపు కలిపిన పాలను సేవించాలి.
 
పొడి ద‌గ్గు వుంటే పుదీనా ఆకుల‌ రసాన్నీ లేదా నీటి ఆవిరిని రోజుకు ఒక‌సారి పీల్చుకోవాలి. ల‌వంగాల పొడిని బెల్లంలోగానీ లేదా తేనెలో గానీ క‌లుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే ద‌గ్గు లేదా గొంతు గ‌ర‌గ‌ర‌నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ద‌గ్గు ఎక్కువ‌గా వుంటే త‌ప్ప‌కుండా వైద్యుల‌ను సంప్ర‌దించాలి. దాహం వేస్తే గోరువెచ్చని వేడినీరును సేవించాలి. రోజూ తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కరోనాను తరిమికొట్టవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యు.ఎస్‌లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

తర్వాతి కథనం
Show comments