Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిట్‌నెస్‌ కోసం మీరేం చేస్తున్నారు? ఇవన్నీ తీసుకుంటున్నారా?

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా వుంటే ఏమైనా సాధించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆధునిక జీవితం, జంక్ ఫుడ్స్ అనారోగ్య సమస్యలను కొనితెచ్చిపెడుతున్నాయి. మనం ఆరోగ్యంగా వుండాలంటే.. పోషకాహారం, వ్యాయ

Webdunia
గురువారం, 8 మార్చి 2018 (16:48 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యంగా వుంటే ఏమైనా సాధించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆధునిక జీవితం, జంక్ ఫుడ్స్ అనారోగ్య సమస్యలను కొనితెచ్చిపెడుతున్నాయి. మనం ఆరోగ్యంగా వుండాలంటే.. పోషకాహారం, వ్యాయామం, యోగా తప్పనిసరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇంకా ఫిట్‌నెస్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఓసారి చూద్దాం.. మనం తీసుకునే ఆహారంలో పీచు అధికంగా వుండేలా చూసుకోవాలి. అందుకే పీచు అధికంగా వుండే కూరగాయలు, కందిపప్పు, బీన్స్, సోయా బీన్స్, తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు తీసుకోవాలి. ఇంకా చేపలను ఆహారంలో చేర్చుకోవాలి. 
 
అలాగే టమోటా జ్యూస్‌ను వారానికి రెండుసార్లైనా తీసుకోకతప్పదు. టమోటాలోని లైకోపిన్, విటమిన్ సి.. అలసటను దూరం చేస్తుంది. పుదీనా, కొత్తిమీర, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు వంటివి తీసుకోవడం ద్వారా క్యాల్షియం, పొటాషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్‌ను పొందవచ్చు. ఈ ధాతువులు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 
ఇక బీట్ రూట్ జ్యూస్‌ను వారానికి ఓసారైనా తీసుకోవాలి. ఇది హైబీపీని దూరం చేస్తుంది. ఇందులోని నైట్రేట్లు.. కండరాలకు అవసరమైన ఆక్సిజన్‌ను ఇస్తోంది. అలాగే సాయంత్రం పూట స్నాక్స్‌గా బజ్జీ, సమోసాలు తినడం కంటే.. ఎండు ద్రాక్షలు, ఖర్జూరాలు వంటి నట్స్‌ను తీసుకోవడం మంచిది. ఇంకా సాయంత్రం పూట పండ్ల ముక్కలను తీసుకోవడం ఉత్తమం.
 
ఇంకా రోజూ డైట్‌లో దానిమ్మ, పెరుగును చేర్చుకోవాలి. దానిమ్మ పండు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. యాంటీ-యాక్సిడెంట్‌గా దానిమ్మ పనిచేస్తుంది. ఇక పెరుగులో క్యాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి ధాతువులు వుంటాయి. ఇవి దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

తర్వాతి కథనం
Show comments