Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెకు మేలు జరగాలా? బరువు తగ్గాలా ఇలా చేయండి..

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా బరువును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరిగే ఫైబర్ కొవ్వు పదార్థాలను తగ్గించే ప్రక్రియలో ఇవి చాలా శక

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (10:06 IST)
పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ఆహారంలో తీసుకుంటే గుండెకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇంకా బరువును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కరిగే ఫైబర్ కొవ్వు పదార్థాలను తగ్గించే ప్రక్రియలో ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఓట్స్, పీస్, బీన్స్, ఆపిల్, సిట్రస్ పండ్లలో ఫైబర్ పుష్కలంగా వుంటుంది. వీటిని రోజూ తీసుకోవడం లేదంటే వారానికి మూడు సార్లైనా డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. 
 
ఇంకా గుండెకు ఆరోగ్యాన్ని చేకూర్చుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కోడిగుడ్లు, కూరగాయలు, వెన్న, ఆలివ్ ఆయిల్‌ను వాడటం ద్వారా గుండెకు మేలు జరుగుతుంది. అలాగే రెడ్ మీట్‌కు బదులు చేపలు తీసుకోవడం మంచిది. అదేవిధంగా గ్రీన్ టీని సేవించడం ద్వారా గుండెను పదిలపరుచుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే మూలకాలు శరీరంలో ఉండే ఎల్‌డీఎల్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడతాయి. అక్రోట్‌కాయలు తక్కువ కొవ్వు పదార్థాల స్థాయిలను కలిగి ఉంటాయి. 
 
వీటిలో అధిక మొత్తంలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లు కలిగి ఉండే చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి. అక్రోటుకాయలను తినటం వలన కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించటమే కాకుండా గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

తర్వాతి కథనం
Show comments