Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకో దానిమ్మ.. అల్పాహారంలో 2 కప్పుల పండ్లు తీసుకుంటే?

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (12:17 IST)
అల్పాహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం కూడదు. ఉదయం పూట తాజా పండ్లు తీసుకొనేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక లెక్క ప్రకారం మూడు కప్పుల కూరలు, రెండు కప్పుల తాజా పండ్ల ముక్కలు తీసుకోవాలి. చాలా మంది ఈ లెక్కను పెద్దగా పాటించరు. ముఖ్యంగా పండ్లను తీసుకోవటాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది సరి కాదు. 
 
తాజా పండ్లలో దొరికే పోషకాలు, విటమిన్‌‌లు ఇతర ఆహార పదార్థాల్లో దొరకవు. సరికాదు పూర్తిగా ఆయా పోషకాలు శరీరంలోకి ఇంకుతాయి. ఇతర ఆహార పదార్థాల్లో పోషకాలు ఉన్నప్పటికీ, వాటిని వండి వార్చేటప్పుడు ఆయా పోషకాలు కొంత వరకు బయటకు పోతాయి. తాజా పండ్ల ముక్కలు, పచ్చి కూరగాయలు లేక పచ్చి ఆకు కూరలతో ఇవి నేరుగా శరీరానికి కావాల్సిన పోషకాలను అందేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంద గ్రాముల దానిమ్మలో 83 కెలోరీలతో కూడిన సామర్థ్యం శరీరానికి లభిస్తుంది. ఇది ఆపిల్ కంటే అధికం. కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టే దానిమ్మలో పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
 
100 గ్రాముల దానిమ్మలో నాలుగు గ్రాముల పీచు ఉంది. ఇది జీర్ణశక్తికి, ప్లేగు సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది. ఇంకా బరువు తగ్గాలనుకునే వారు రోజుకో దానిమ్మను తీసుకోవచ్చు. దీనిని క్రమం తప్పకుండా తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
రక్త ప్రసరణ క్రమంగా ఉంటుంది. క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చు. విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మలో ధాతువులు, క్యాల్షియం, కాపర్, పొటాషియం, మాంగనీస్‌లు కూడా ఉన్నాయి.

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

Show comments