ఏసీకి అలవాటయ్యారో మీ పని గోవిందా! రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో అనారోగ్యాలే!

మనిషి చేతిలో ఫోన్ ఎంత అవసరమో ఇప్పుడు ఇంటికి ఏసీ కూడా అంతే అవసరంగా ఉంది. ఏసి మనుషుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే ఇంట్లో, ఆఫీసులో, థియేటర్, హోటల్, కారులో ఇలా ప్రతిచోట ఏసి కావాలి. డబ్బులు ఎక్కువై

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (13:32 IST)
మనిషి చేతిలో ఫోన్ ఎంత అవసరమో ఇప్పుడు ఇంటికి ఏసీ కూడా అంతే అవసరంగా ఉంది. ఏసి మనుషుల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే ఇంట్లో, ఆఫీసులో, థియేటర్, హోటల్, కారులో ఇలా ప్రతిచోట ఏసి కావాలి. డబ్బులు ఎక్కువైనా ఫర్వాలేదు కానీ ఖచ్చితంగా ఇంట్లో ఏసి ఉండాలి. ఇప్పుడు ఏసి అనేది అవసరం మాత్రమే కాదు, ఒక స్టేటస్ సింబల్‌లా మారిపోయింది. అయితే ఈ ఏసి ఒంటికి ఎంత చల్లదనాన్ని ఇస్తుందో అంతేస్థాయిలో హాని కూడా కలిగిస్తుంది.
 
వేసవికాలంలో ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం ఏసీ వాడటం చల్లదనమే కానీ.. దానిని అతిగా ఉపయోగించడం అనర్థాలకు దారితీస్తుంది. ఏసీని ఉపయోగించడమే కాదు.. దానిని రెగ్యూలర్‌గా సర్వీసింగ్ చేయించాలి. లేదంటే అందులో ఉండే దుమ్ము, ధూళి ఇంట్లోనే తిరుగుతూ అనారోగ్యానికి గురిచేస్తుంది.
 
ఎక్కువ సమయం ఏసిలో గడిపితే రోగనిరోధకశక్తి తగ్గుతూ ఉంటుంది. తరచుగా తలనొప్పి, జ్వరం లాంటి చిన్న సమస్యలతో పాటు, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
 
ఏసి అంటే కృత్రిమంగా వాతావరణాన్ని చల్లబరచుకోవడం. దీనివల్ల చర్మ కణాల పొడిగా మారుతుంది. పైన చర్మం చల్లగా ఉంటే సరిపోదు. శరీరం లోపల కూడా చల్లగా ఉండాలి. ఏసి వలన చర్మం చల్లగా ఉంటుంది కానీ, బాడి లోపల వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
 
ఏసిలో ఎక్కువగా గడిపితే స్వచ్ఛమైన బయటి గాలికి దూరమవుతారు. కాంటాక్ట్‌లెన్స్ వినియోగిస్తున్నవారికి, కంటి వ్యాధులున్న వారికి, ఆస్తమా రోగులకు ఏసీ కారణంగా సమస్య పెరిగే అవకాశం అధికంగా ఉంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమరావతిలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, బాబుతో భేటీ

ఏపీలో బిల్ గేట్స్.. ఘన స్వాగతం పలికిన నారా లోకేష్- సచివాలయంలో ఏపీ సీఎంతో భేటీ..

ఉత్తర కొరియాలో వారసత్వ పోరు.. కిమ్ కుమార్తెతో పోటీ పడుతున్న సోదరి

Solar Eclipse 2026: ఫిబ్రవరి 17న వలయాకార సూర్యగ్రహణం

పాత సిమ్ కార్డులు, ఈ వేస్ట్ నుంచి రూ.27లక్షల విలువైన బంగారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: ఎగస్ పార్టీ కి దూల తీసి దూపం ఏసేవాడే పెద్ది !

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

తర్వాతి కథనం
Show comments