Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పప్పులో వున్న ప్రయోజనాలు తెలిస్తే చక్కగా వలుచుకుని తినేస్తారు...

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (23:36 IST)
పిస్తా పప్పు. ఈ పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. అంతేకాకుండా కంటి సమస్యలతో బాధపడేవారికి పిస్తా మంచి ఫలితాన్నిస్తుంది. ఇందులోని కెరోటినాయిడ్లు కంటిలోని కణాలను పునరుద్ధరించి కంటిచూపు స్పష్టంగా ఉండేలా చేస్తాయి.
 
ఇది శరీరంలోని ఊపిరితిత్తులకు మరియు ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
 
పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా లభిస్తుంది. అందువల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పిస్తాపప్పు శరీరంలోని చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ని పెరిగేలా చేస్తుంది. అందువల్ల గుండె జబ్బుల సమస్యలు తగ్గుతాయి. ఇది నరాల వ్యవస్థను బలోపేతం చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
 
ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ బి శరీరంలోని వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో కీలకపాత్ర  పోషిస్తాయి. ఇది శరీరాన్ని అనేక శారీరక రుగ్మతల నుండి దూరం చేస్తుంది. శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. శరీరంలోన ఏర్పడే ఫ్రీరాడికల్స్ నుండి రక్షిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

తర్వాతి కథనం
Show comments