Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొప్పాయి గుజ్జులో తేనె కలిపి తీసుకుంటే..?

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (16:55 IST)
అన్నీ సీజన్లలో లభించే బొప్పాయిలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. బొప్పాయి ఆకులు, గింజలు, పండ్లలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలున్నాయి. బొప్పాయి పండ్లు బరువును తగ్గిస్తాయి. కీళ్ళ నొప్పులను నయం చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తాయి. చర్మాన్ని కాపాడుతాయి. వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. పేగుల్లో ఏర్పడే అలర్జీలకు చెక్ పెడతాయి. 
 
అలాగే బొప్పాయి ముక్కలను రోజూ తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పిల్లల పెరుగుదలకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. దంతాలు, ఎముకలకు బలాన్నిస్తాయి. పచ్చి బొప్పాయి ముక్కలను వేపుళ్ల రూపంలో తీసుకుంటే బరువు తగ్గుతారు. కాలేయం, కిడ్నీ సంబంధిత రోగాలు నయం అవుతాయి. బొప్పాయి ముక్కలను తేనేతో కలిపి తీసుకుంటే నరాల బలహీనత నయం అవుతుంది. రోజూ కప్పు తేనె కలిపిన బొప్పాయి ముక్కలు ఒబిసిటీని దరిచేరనివ్వవు. 
 
బొప్పాయి గుజ్జును తేనెతో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. బొప్పాయి గింజల పొడిని పాలలో కలిపి తీసుకుంటే ఉదర సంబంధిత రుగ్మతలు నయం అవుతాయి. పిల్లలకు బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. రోజూ అరకప్పు బొప్పాయి ముక్కలను పిల్లల స్నాక్స్ బాక్సుల్లో ఇవ్వడం ద్వారా వారిలో పెరుగుదల సులువవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments