Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చిమిర్చి తిన్నారో.. మూడు గంటలకు..?

పచ్చిమిర్చిలో కేలరీలు శూన్యం. అయినా కేలరీలకు మించిన శక్తి... పచ్చిమిర్చిని తినడం ద్వారా లభిస్తుంది. ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిర్చిని తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభా

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (10:33 IST)
పచ్చిమిర్చిలో కేలరీలు శూన్యం. అయినా కేలరీలకు మించిన శక్తి... పచ్చిమిర్చిని తినడం ద్వారా లభిస్తుంది. ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను 50శాతం వేగవంతం చేస్తాయి. పచ్చిమిర్చిని తిన్న మూడు గంటల పాటు ఈ ప్రభావం శరీరంలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇంకా మూడ్ బాగోలేకపోతే పచ్చిమిర్చిని కొరకాల్సిందే. మూడ్ బాగోలేనప్పుడు, శరీరం అసౌకర్యంగా, నొప్పులుగా అనిపిస్తున్నప్పుడు పచ్చిమిర్చిని వంటకాల్లో చేర్చుకుని తీసుకుంటే.. దానివల్ల ఎండార్ఫిన్లు విడుదలై మంచి మూడ్ రావడానికి, నొప్పి ఉపశమనంగానూ పనిచేస్తాయి. 
 
పచ్చిమిర్చిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఐరన్ లోపం ఉన్నవారు పచ్చిమిర్చిని వాడాలి. అలాగే ఇందులోని విటమిన్ సీ, బీటా కెరోటిన్ ఉండడం వల్ల పచ్చిమిరపకాయలు కంటి, చర్మ ఆరోగ్యానికి, రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి తోడ్పడతాయి. 
 
పచ్చిమిరపకాయలను ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో షుగర్ స్థాయులను కూడా కంట్రోల్ చేస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు తమ ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాలి. చర్మానికి రక్షణనిస్తుంది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు బాగానే ఉన్నాయి. అందుకే చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి. పచ్చిమిర్చిలో విటమిన్ కె కూడ తగినంత ఉంటుంది. ఇది అస్టియోపోరోసిస్ రిస్క్‌ను తగ్గించడమే కాకుండా బ్లీడింగ్ సమస్య లేకుండా చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

తర్వాతి కథనం
Show comments