Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెకు మేలు చేసే చేప: చేప కూరలకు ఆలివ్ ఆయిల్‌నే వాడండి.

గుండెను పదిలం చేసుకోవాలా? అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది కూడా నూనె ఎక్కువగా ఉన్న చేపలను ఆరగించాలి. దీని వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఆరు నుంచి 12శాతం

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (09:51 IST)
గుండెను పదిలం చేసుకోవాలా? అయితే వారానికి రెండు లేదా మూడు సార్లు చేపలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అది కూడా నూనె ఎక్కువగా ఉన్న చేపలను ఆరగించాలి. దీని వల్ల గుండెపోటు వచ్చే ముప్పు ఆరు నుంచి 12శాతం వరకు తగ్గుతుందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. చేపల వినియోగానికి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నిపుణులు పరిశోధించారు. 
 
గుండె ఆరోగ్యంగా ఉండటానికి తీసుకొనే చేపలలో, మంచి నీటిలో పెరిగే చేపల కన్నా ఉప్పు నీటిలో పెరిగే చేపలు ఎక్కువగా ఒమేగా-3 ఫాటీ ఆసిడ్‌లని కలిగి ఉంటాయి. సాల్మన్, ట్యునా, సార్డైన్స్, మాకేరాల్ వంటి ఉప్పు నీటిలో పెరిగే చేపలు చాలా ఆరోగ్యకరమని పరిశోధకులు తెలిపారు. 
 
చేప ఆహారంలో ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి. ప్రత్యేకించి సముద్రపు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వుంటాయి. వీటిలో వుండే కొవ్వు శరీరంలో మంచి కొలెస్టరాల్ స్థాయిని పెంచుతుంది. ఫలితంగా రక్తనాళాలలో ఏర్పడే బ్లాకులను తొలగించేందుకు సహకరిస్తుంది. గుండె ఆరోగ్యంగా వుండాలంటే వారానికి కనీసం 8 నుండి 10 ఔన్సుల చేప ఆహారాన్ని తినాలి. అంటే రోజుకు కనీసం 25 గ్రాముల చేప ఆహారం వుంటే చాలు. చేపలు తినేటపుడు మాంసాన్ని మానడం మంచిది. రెండూ తింటే కేలరీలు అధికమైపోతాయి.
 
చేపలను చాలామంది వీటిని అధికంగా వేడిచేసి పోషకాలు పోగొడతారు. అతిగా వేడి చేస్తే వాటిలో వుండే పోషకాహారాలు పోయి ఫలితాన్నివ్వవు. వాటిని కొద్దిపాటి గ్రిల్లింగ్ చేస్తే చాలు. వాసన మరీ ఘాటుగా వుంటే మైక్రోవేవ్ ఒవెన్ ఉపయోగించి వండండి. తేలిక, త్వరగా అయిపోతుంది. చేపను వండటానికి ఎల్లపుడూ ఆలివ్ ఆయిల్ వాడండి. ఆలివ్ ఆయిల్ పోషకాలను నశింపచేయవు. ఇంకా చేపల్లోనే నూనె వుంటుంది. అందుచేత చేప కూరలకు అధికంగా నూనె వాడాల్సిన అవసరం లేదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

తర్వాతి కథనం
Show comments