Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకు బదులు ఉలవలు, వేరుశెనగలు తీసుకుంటే?

పాలు తీసుకోవడం ఇబ్బందిగా వుంటే..? పాలు తాగినా జీర్ణం కాకపోతే.. దానికి ప్రత్యామ్నాయాలుగా ముడి ధాన్యాలు, కాయధాన్యాలు, పప్పులు తీసుకోవచ్చు. వేరుశెనగ, బాదం, జీడి, పిస్తా వంటివి రోజువారీ డైట్‌లో చేర్చుకుంట

Webdunia
శుక్రవారం, 20 అక్టోబరు 2017 (10:34 IST)
పాలు తీసుకోవడం ఇబ్బందిగా వుంటే..? పాలు తాగినా జీర్ణం కాకపోతే.. దానికి ప్రత్యామ్నాయాలుగా ముడి ధాన్యాలు, కాయధాన్యాలు, పప్పులు తీసుకోవచ్చు. వేరుశెనగ, బాదం, జీడి, పిస్తా వంటివి రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే.. పాలలోని క్యాల్షియం అవసరాలను తీర్చుకోవచ్చు. 
 
వేరుశెనగ పప్పు క్యాల్షియాన్ని పుష్కలంగా కలిగి వుంటుంది. వేరు శెనగలను పచ్చిగా స్వీకరిస్తే సంపూర్ణ ఆహారమవుతుంది. వేరుశెనగని కనీసం ఆరు గంటల పాటు నీళ్ళలో నానబెట్టాలి. దీనివల్ల పిత్తానికి సంబంధించిన అంశాలు పక్కకు వెళిపోతాయి. నానబెట్టని వేరుశెనగలను ఎక్కువ తీసుకోకూడదు. 
 
అదేవిధంగా ఉలవలు కూడా పాలకు తగిన ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఉలవలు ఐరన్, క్యాల్షియంలకు మంచి వనరు. ఇది శాకాహారం ద్వారా అందే మంచి ప్రోటీన్లకు అత్యుత్తమమైన వనరు. క్యాల్షియం, ఐరన్ ఇతర రసాయాన పదార్థాలతో కలిసి ఉండడం వల్ల, శరీరం వీటిని తేలిగ్గా స్వీకరించలేదు. ఉలవల్ని మొలకెత్తించడం ఒక సులువైన పధ్ధతి. ఈ ప్రక్రియ ఐరన్, క్యాల్షియంల లభ్యతని పెంచడం వల్ల ఉలవల పోషక విలువ బాగా పెరుగుతుంది.
 
అంతేకాక, మొలకెత్తిన ఉలవలు చాలా సులభంగా జీర్ణమవుతాయి. ఉలవలు శరీరంలోని ఉష్ణాన్నిపెంచుతాయి. దీనివల్ల వానాకాలం, శీతాకాలంలో దగ్గు, జలుబును పక్కనబెట్టేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments