Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము చుట్టు కొలతను పెంచనివ్వని ఆకుకూరలు.. గుండెకు కూడా మేలే

ఆకుకూరల్లో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోవాలా అయితే ఈ కథనం చదవండి. తక్కువ ధరలో, ఎక్కువ పోషకాలు లభించే పచ్చని ఆకుకూరల్లో అనారోగ్యాన్ని దూరంగా ఉంచే శక్తి వుంది. ఇవి తింటే ఆరోగ్యంగా జీవించవచ్చు.

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (10:21 IST)
ఆకుకూరల్లో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకోవాలా అయితే ఈ కథనం చదవండి. తక్కువ ధరలో, ఎక్కువ పోషకాలు లభించే పచ్చని ఆకుకూరల్లో అనారోగ్యాన్ని దూరంగా ఉంచే శక్తి వుంది. ఇవి తింటే ఆరోగ్యంగా జీవించవచ్చు. 
 
పచ్చని ఆకుకూరలు గుండెకు మేలు చేస్తాయి. నడుము చుట్టు కొలతను పెంచనివ్వవు. ముఖ్యంగా తీగబచ్చలి కూరలో విటమిన్లు కె, ఎ, సి, బి2, బి6 ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావం నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఈ ఆకుల్ని బజ్జీలు, సూప్‌లలో వేయండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే మెంతికూరలో అద్భుతమైన ఔషధ ఆహారం. ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉడకబెట్టిన మెంతికూర ఆకులు అజీర్ణాన్ని పోగొడతాయి. మందంగా ఉన్న కాలేయాన్ని చురుకుగా పనిచేయిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. శ్వాసక్రియలోని అవరోధాలు సరిచేస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కీలకమవుతాయి. 
 
మెంతికూరలో క్యాల్షియం, ఇనుము, ఫాస్పరస్‌తో పాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇది ఆకలిని పుట్టిస్తుంది. కీళ్ళ నొప్పులను నయం చేస్తుంది. ఒక గుప్పెడు మెంతి ఆకులను పరోటాలలో, చట్నీలలో వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయి.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

తర్వాతి కథనం
Show comments