Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిస్తే పాదాలకు ఏమవుతుందో తెలుసా?

Foot
Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:14 IST)
మనిషి శరీర భాగాల్లో పాదాలు కూడా ముఖ్యమైనవి. ఈ పాదాలు మనిషి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా, ఒక చోటు నుంచి మరోచోటకు వెళ్లేందుకు ఎలాంటి ఇంధనం లేకుండా హాయిగా నడిచి వెళ్లొచ్చు. ఇలాంటి పాదాల గురించి మీరు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. 
 
ప్రతి మనిషి జీవితకాలంలో పాదాలు సగటున 1.85 లక్షల కిలోమీటర్లు నడుస్తాయట. ఈ దూరం భూమిని నాలుగు సార్లు చుట్టి వచ్చిన దాంతో సమానంగా చెపుతారు. చూడటానికి చిన్నగా కనిపించినా మానవ శరీరంలో ఉండే ఎముకల్లో 25 శాతం పాదాల్లోనే ఉంటాయి. 
 
ఒక పాదంలో 23 ఎముకలు, 32 కీళ్లు, 107 లింగమెంట్స్, 19 కండరాలు ఉంటాయి. అందుకే అడుగు సరిగ్గా వేయకుంటే వీటిలో ఏదో ఒకటి దెబ్బతినే అవకాశం ఉంది. రెండు పాదాల్లో కలిసి 2.50 లక్షల శ్వేద గ్రంధులు ఉంటాయి. వీటి ద్వారా రోజుకు 200 మిల్లీ లీటర్ల చెమట ఉత్పత్తి అవుతుంది. 
 
పరుగెత్తేటపుడు మనిషి బరువు కంటే నాలుగు రెట్ల బరువు పాదాలపై పడుతుంది. ఉష్ణ ప్రాంతాల్లో ఉండే వారిలో చేతి, కాలి గోళ్లు వేగంగా పెరుగుతాయట. 
 
అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి పది మంది మహిళలు తమ పాదాల కంటే తక్కువ సైజు చెప్పులు వాడుతూ పాదాలకు హాని కలిగిస్తున్నారు. మగవాళ్ళతో పోల్చితో ఆడవారిలో పాదాలకు సంబంధించిన సమస్యలు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని ఆర్థోపెడిక్స్ వైద్యులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

ఆస్తి కోసం కుమార్తె చంపి నదిలో పాతి పెట్టిన సవతి తల్లి!!

మార్క్ శంకర్ పవనోవిచ్‌ను కాపాడిన వారిని సత్కరించిన సింగపూర్

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

తర్వాతి కథనం
Show comments