Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

సిహెచ్
సోమవారం, 2 జూన్ 2025 (15:46 IST)
దేశవ్యాప్తంగా కోవిడ్, ఫ్లూ కేసులు పెరుగుతున్న వేళ, మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవటం చాలా ముఖ్యం. కాలానుగుణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు కారణంగా తరచుగా దగ్గు, జలుబు, జీర్ణ సమస్యలు, మొత్తంమీద బలహీనమైన రోగనిరోధక శక్తి వంటి అనేక ఆరోగ్య సవాళ్లు ఎదురవుతాయి. బాదం, పసుపు, అల్లం వంటి పోషకాలు అధికంగా ఉండే సూపర్‌ఫుడ్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవటంతో పాటుగా ఈ విపత్కర సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో గణనీయంగా సహాయపడుతుందని ఎంబిబిఎస్, పోషకాహార నిపుణురాలు డాక్టర్ రోహిణి పాటిల్ సూచిస్తున్నారు. 
 
ఈ ఇన్ఫెక్షన్ల సమయంలో మీ శరీరంను ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుకోవటానికి మీ సాధారణ ఆహారంలో చేర్చుకోవాల్సిన, రోగనిరోధక శక్తిని పెంచే సూపర్‌ఫుడ్‌లను డాక్టర్ రోహిణి సిఫార్సు చేస్తున్నారు. అవేమిటో చూద్దాము.
 
కాలిఫోర్నియా బాదం: డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అయిన కాలిఫోర్నియా బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, జింక్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శక్తిని  పెంచడంలో సహాయపడతాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) సిఫార్సు చేసిన ప్రకారం, మీ రోజువారీ ఆహారంలో బాదం పప్పును చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. తద్వారా మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది. అదనంగా, కాలిఫోర్నియా బాదం పప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన చర్మానికి మద్దతు లభిస్తుంది. వాటి సహజమైన సంతృప్తికరమైన లక్షణాల కారణంగా సమర్థవంతమైన రీతిలో బరువు నిర్వహణకు సైతం సహాయపడుతుంది.
 
పసుపు: యాంటీ ఇన్ఫ్ల మేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లను ఎదుర్కుంటుంది, ఫ్లూ సీజన్‌లో మీ ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరి. 
 
అల్లం: అల్లం జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది, మంటను తగ్గిస్తుంది. శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది కాలానుగుణ మార్పుల సమయంలో సాధారణ జలుబు, గొంతు నొప్పిని ఎదుర్కోవడానికి అనువైనదిగా చేస్తుంది.
 
వెల్లుల్లి: వెల్లుల్లిలో అల్లిసిన్ వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీమైక్రోబయల్ ప్రభావాలను ప్రదర్శిస్తుంది, ఇది ఫ్లూ సీజన్‌లో ప్రయోజనకరంగా ఉంటుంది.
 
సిట్రస్ పండ్లు: నారింజ, నిమ్మకాయలు మరియు ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యాన్ని పెంచడానికి కీలకమైనది ఈ విటమిన్ సి, కాలానుగుణ పరివర్తనల సమయంలో వాటిని కీలకంగా చేస్తుంది.
 
బొప్పాయి: విటమిన్లు ఎ, సి సమృద్ధిగా ఉన్న బొప్పాయి జీర్ణక్రియకు సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తుంది.
 
కాలానుగుణ ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కల్పించడానికి, మొత్తం శ్రేయస్సును కాపాడుకోవడానికి ఫ్లూ సీజన్‌లో బాదం వంటి ఈ సూపర్‌ఫుడ్‌లను మీ ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్ పాటిల్ సిఫార్సు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

Annadata Sukhibhava: ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ పథకం అమలు.. చంద్రబాబు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

తర్వాతి కథనం
Show comments