Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపవాసం ఉంటే.. నిత్యయవ్వనులుగా ఉంటారట.. బరువు కూడా తగ్గుతారట..

ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే అమెరికా యూనివర్శిటీ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే? నిత్యం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారికి ఉపవాసానికి మించిన మందు మరొకటి లేదంట

Webdunia
గురువారం, 16 మార్చి 2017 (13:32 IST)
ఉపవాసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే అమెరికా యూనివర్శిటీ పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే? నిత్యం యవ్వనంగా ఉండాలని కోరుకునే వారికి ఉపవాసానికి మించిన మందు మరొకటి లేదంటున్నారు. వయసుతో పాటు వచ్చే దుష్ప్రభావాలను దూరం చేసుకోవాలంటే.. ఉపవాసం ఉండాల్సిందేనని పరిశోధకులు అంటున్నారు. 
 
ఎలుకలపై జరిగిన పరిశోధనలో ఈ విషయం తేలిందని పరిశోధకులు అంటున్నారు. కొన్ని ఎలుకలకు కొన్ని రోజుల పాటు తక్కువ ఆహారాన్ని.. మరికొంత కాలం ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని అందించారు. తక్కువ ఆహారం తీసుకున్న ఎలుకలు బరువు తగ్గడంతో పాటు అంతకుముందు కంటే ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా కనిపించాయని పరిశోధకులు గుర్తించారు.
 
వీటి కణాల ఉత్పత్తిలోనూ మార్పు కనిపించిందని గుర్తించారు. ఇదేవిధంగా మానవులు కూడా తక్కువ ఆహారాన్ని లేదా ఉపవాసం ఉండటం ద్వారా బరువు తగ్గడం.. నిత్య యవ్వనులుగా ఉంటారని పరిశోధనలో వెల్లడైంది. ఉపవాసం ఉంటే.. వ్యాధినిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంతేగాకుండా.. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యాన్సర్‌ను తరిమికొడుతుందని, బరువును తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

తర్వాతి కథనం
Show comments