Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాస్ట్ ఫుడ్స్‌ తెగలాగిస్తున్నారా..? కవర్లతో జాగ్రత్త సుమా...!

ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటుపడ్డారా? అయితే వాటిని భద్రపరిచే వ్రాపర్స్‌తో జాగ్రత్త అంటున్నారు.. యూనివర్శిటీ ఆఫ్ ఆలబామా పరిశోధకులు. ఫాస్ట్ ఫుడ్స్‌ను భద్రపరిచే కవర్లు.. ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనా

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (16:25 IST)
ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటుపడ్డారా? అయితే వాటిని భద్రపరిచే వ్రాపర్స్‌తో జాగ్రత్త అంటున్నారు.. యూనివర్శిటీ ఆఫ్ ఆలబామా పరిశోధకులు. ఫాస్ట్ ఫుడ్స్‌ను భద్రపరిచే కవర్లు.. ఇతరత్రా ప్లాస్టిక్ వస్తువుల్లోని రసాయనాల ద్వారా మనం తీసుకునే ఫాస్ట్ ఫుడ్స్ అనారోగ్యాలను కొనితెచ్చిపెడుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్స్‌ను భద్రపరిచేందుకు ఉపయోగించే వ్రాపర్స్‌లోని టాక్సిన్స్, కార్సినోజెనిక్ టెఫ్లన్ కెమికల్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు తప్పవని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
ఈ విషయం ఫాస్ట్ ఫుడ్స్ ప్యాక్ చేసే పేపర్లు, ప్లాస్టిక్ పదార్థాలను పరిశోధించడంతో వెలుగులోకి వచ్చిందని పరిశోధకులు అంటున్నారు. వ్రాపర్స్ తయారీ కోసం ఉపయోగించే రసాయనాల ద్వారా క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు అంటున్నారు. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడి తీసుకునే పిల్లల్లో వీటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు.
 
జంక్ ఫుడ్స్‌తోనే కాదు.. జంక్ ఫుడ్స్‌ను భద్రపరిచే ప్యాకెట్లతోనూ ఆరోగ్యానికి కీడు జరుగుతుందని.. అందుకే వాటిని తీసుకోవడం చాలామటుకు తగ్గించడం మంచిదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. బ్రెడ్, డెసర్ట్స్, బర్గర్లు, పిజ్జాలను ప్యాక్ చేసే వ్రాపర్స్ ద్వారా వాటిని ఆహారంగా తీసుకునే మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఇందుకు వాటి తయారీకి పీఎఫ్ఓఎస్ (పర్-అండ్ పోలిఫ్లూరోల్కిల్ సబ్‌స్టన్స్), టాక్సిక్ సబ్‌స్టన్స్ అనే రసాయనాలు ఉపయోగించడమే కారణమని పరిశోధకులు అంటున్నారు. 
 
ఈ రసాయనాలతో తయారైన కవర్లలో భద్రపరిచే ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే..  మెదడు పనితీరు మందగిస్తుందని, కాలేయం, ఉదరం, ఊపిరితిత్తులు, గర్భాశయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశోధనలో తేలింది. ఇంకా కిడ్నీ, టెస్టికులర్ క్యాన్సర్స్, కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, సంతానలేమికి కారణం కావడం, థైరాయిడ్ ఏర్పడటం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వంటివి తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ట్యూషన్‌కు వచ్చే బాలుడుతో రొమాన్స్... ఇంటి నుంచి పారిపోయిన యంగ్ లేడీ టీచర్...!!

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

తర్వాతి కథనం
Show comments