Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటుక పెట్టుకోవడం వల్ల ఫలితాలు ఏమిటి?

కాటుక అనేది స్త్రీలకు ఉన్న సుమంగళ ద్రవ్యములలో ఒకటిగా చెప్పబడినది. స్త్రీలు వారి ఐదవతనమును కొరకు కాటుక ధరిస్తారు. సూర్య కిరణాలు నేరుగా పడటంవల్ల కంటికి హాని కలుగుతుంది. కాటుక ధరించడం వల్ల కంటికి చలువ చేస్తుంది కనుక సూర్య కిరణాలు పడినను కంటికి ఎటువంటి హ

Webdunia
శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (16:31 IST)
కాటుక అనేది స్త్రీలకు ఉన్న సుమంగళ ద్రవ్యములలో ఒకటిగా చెప్పబడినది. స్త్రీలు వారి ఐదవతనమును కొరకు కాటుక ధరిస్తారు. సూర్య కిరణాలు నేరుగా పడటంవల్ల కంటికి హాని కలుగుతుంది. కాటుక ధరించడం వల్ల కంటికి చలువ చేస్తుంది కనుక సూర్య కిరణాలు పడినను కంటికి ఎటువంటి హాని కలుగదు. కాటుక యొక్క మహిమను శ్రావణమంగళవారము నోములో తెలిపియున్నారు.
 
ఆయుర్వేదం ప్రకారం కాటుక పెట్టుకోవడం వల్ల కళ్లకు చల్లదనం లభిస్తుంది. అలాగే దుమ్ము, ధూళి కణాలు కళ్లలో పడకుండా కాటుక అడ్డుకుంటుంది. అంతేకాదు కళ్లు ఎప్పుడూ తాజాగా, మెరుస్తుండేట్టు చేస్తుంది. కళ్లలో ఏర్పడే ఎర్రటి మచ్చలు కాటుక పెట్టుకోవడం వల్ల తగ్గిపోతాయి. ఇన్ని విధాలుగా ఉపయోగపడే కాటుక తయారీలో ప్రమిద, ఆముదం, దూది(వత్తి), రాగి పాత్ర, గంధం, కర్పూరం ఉపయోగిస్తారు. 
 
కాటుకని ధరించడానికి ముఖ్యమైన కారణం అందం. ప్రకృతిలో మనిషికి మాత్రమే నల్లటి కనుగుడ్డు చుట్టూతా తెల్లటి కంటిభాగం ఉంటుంది. దీనినే స్క్లెరా అంటారు. ఈ తెల్లటి భాగం వల్లే కనుగుడ్డు ఎటు కదులుతోందో? మనిషి కళ్లు పలుకుతున్న భావాలు ఏమిటో? తెలుస్తాయి. ఈ స్క్లెరా చుట్టూ కాటుకని పూయడం వల్ల కళ్లు పలికే భావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకనే భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు చేసేవారు, తప్పకుండా కాటుకను ధరించి తీరతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments