Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెంచ్ ఫ్రైస్‌తో శీఘ్ర మరణం తథ్యం... వేయించకుండా ఇలా ఉడికిస్తే సరి...

మీకు ఫ్రెంచ్ ఫ్రైస్‌ అంటే చాలా ఇష్టమా... నూనెలో వేయించిన ఆ బంగాళాదుంప ముక్కలను తలచుకుంటేనే నోరూరుతోందా... వేపుళ్లు మంచిది కాదనే మాటను పెడచెవిన పెట్టే ప్రతి ఒక్కరూ చదవవలసిందే... మీ ఆరోగ్యానికి ఫ్రెంచ్

Webdunia
బుధవారం, 14 జూన్ 2017 (16:38 IST)
మీకు ఫ్రెంచ్ ఫ్రైస్‌ అంటే చాలా ఇష్టమా... నూనెలో వేయించిన ఆ బంగాళాదుంప ముక్కలను తలచుకుంటేనే నోరూరుతోందా... వేపుళ్లు మంచిది కాదనే మాటను పెడచెవిన పెట్టే ప్రతి ఒక్కరూ చదవవలసిందే... మీ ఆరోగ్యానికి ఫ్రెంచ్ ఫ్రైస్‌ మంచిది కాదు అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఉత్తర అమెరికాలో సుమారు 4,400 మందిపై దాదాపు 8 సంవత్సరాలు అధ్యయనం చేసి, బల్లగుద్ది మరీ చెప్తోంది ఓ సంస్థ. 
 
తరచుగా ఫ్రెంచ్ ఫ్రైస్‌ తినేవారు మరింత త్వరగా మరణిస్తారని ఆధారాలనూ చూపుతోంది. కొవ్వు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్‌ వంటి వాటిని తినడం వల్ల బరువు పెరగడం మాత్రమే కాకుండా మరిన్ని జటిలమైన సమస్యల బారిన పడతారని చెప్తున్నారు. 45 నుండి 79 సంవత్సరాల మధ్య వయస్సు గల 4400 మందిని, వారు ఎంత తరచుగా వేయించిన, వేయించని బంగాళాదుంపలను తింటున్నారనేదాన్ని ట్రాక్ చేసారు. 
 
అధ్యయనం జరుగుతున్న సమయంలోనే 236 మంది మరణించారు. రెస్టారెంట్లలో కానీ, ఇంట్లో కానీ చేసిన వేయించిన బంగాళాదుంపలను వారానికి రెండుసార్లు లేదా అంతకంటే ఎక్కువగా తిన్నవారు మిగతావారితో పోల్చితే త్వరగా మరణించినట్లు నిర్ధారించారు.
 
అయితే ఈ అధ్యయనంలో పరిశోధించినది ఈ వేయించిన బంగాళాదుంపలను తినడం మరియు మరణం బారిన పడే ప్రమాదావకాశం ఎక్కువ కావడం. అంతే కానీ, వీటిని తినడం వల్లే మరణిస్తారని చెప్పడం లేదు. మరణించేందుకు కారణాల్లో మరింత అధికంగా ఫ్రెంచ్ ఫ్రైస్‌ తీసుకోవడం, వంటనూనె నాణ్యత వంటివి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. 
 
ఫ్రెంచ్ ఫ్రైస్‌‌పై మోజు వదులుకోలేక తినాలనుకునేవారు ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే ఓ చిట్కా కూడా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనుకునేవారు వాటిని వేయించకుండా ఉడికిస్తే మంచిది. ఉడికించినవి కరకరలాడవనుకుంటే, కొద్దిగా ఆలివ్ ఆయిల్, రాతి ఉప్పు, మిరియాలపొడిని కలిపి, బంగాళాదుంపలను ఉడికించే ముందు వాటిపై రుద్ది, ఆ తర్వాత ఓవెన్‌లో ఉడికిస్తే సరి. ఇలా చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్‌ కరకరలాడటంతో పాటు సాధారణ ఫ్రెంచ్ ఫ్రైస్‌ కంటే ఎక్కువ రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

తర్వాతి కథనం
Show comments