Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ, కాఫీల్లో పంచదారకు బదులు..?

Webdunia
మంగళవారం, 27 ఆగస్టు 2019 (17:32 IST)
మనం టీ, కాఫీలలోనే కాకుండా పలు రకాల స్వీట్ల తయారీలో కూడా చక్కెరను విరివిగా వాడుతుంటాం. కానీ చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానికి బదులుగా బెల్లం ఉపయోగించడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం అనేక రకాలుగా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. 
 
శ్వాసనాళాలు, రక్తనాళాలు శుద్దిపడాలంటే కూడా బెల్లం ఖచ్చితంగా తినాలి. రక్త ప్రసరణ కూడా మెరుగవుతుంది. దగ్గు, జలుబును కూడా బెల్లం సులభంగా దూరం చేయగలదు. చక్కెర లాగా బెల్లం వలన దుష్ప్రభావాలు ఉండవు. శరీరంలోని మలినాలను బయటకు వెళ్లేలా చేస్తుంది. ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే ఇంకా మంచిది. బెల్లంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. 
 
ఎక్కువగా తిని ఇబ్బంది పడుతున్న సమయంలో బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఐరన్ లోపం ఉన్న వాళ్లు బెల్లం తింటే మంచిది. రక్తాన్ని ఉత్పత్తి చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. బెల్లం తింటే ముఖంపై మచ్చలు, మొటిమలు కూడా తగ్గుతాయి. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. రుతుక్రమ సమస్యలతో బాధపడే మహిళలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

తర్వాతి కథనం
Show comments