Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూవారీ డైట్‌లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. బ్రొకోలి.. బాదం పప్పులు తీసుకుంటే?

చాలామంది బతకడానికి ఏదోకటి తినాలని తింటుంటారు. కాని ఏం తింటున్నారో కూడా పట్టించుకోరు. విటమిన్లు, ఖనిజాలు, పోషకపదార్థాలు ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఫైటోన్యూట్రియంట్స్

Webdunia
మంగళవారం, 21 జూన్ 2016 (16:45 IST)
చాలామంది బతకడానికి ఏదోకటి తినాలని తింటుంటారు. కాని ఏం తింటున్నారో కూడా పట్టించుకోరు. విటమిన్లు, ఖనిజాలు, పోషకపదార్థాలు ఎక్కువ ఉండే ఆహారపదార్థాలు శరీరాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతాయి. ఫైటోన్యూట్రియంట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఎ, విటమిన్‌-ఇ, వంటివి కూడా మనం తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. అలాంటి బలవర్థకమైన ఆహారపదార్థాలు క్రమం తప్పకుండా రోజూవారీ డైట్‌లో తీసుకుంటే ఆరోగ్యంగా ఉంచడంతో పాటు యంగ్‌గా ఉండేందుకు సహకరిస్తుంది.
 
యాపిల్స్‌లో పీచుపదార్థాలు, విటమిన్‌-సి లు పుష్కలంగా ఉంటుంది. బ్లూ బెర్రీస్‌లో ఫైటోన్యూట్రియంట్స్‌ బాగా ఉంటాయి. ఇవి గుండెజబ్బులు, డయాబెటిస్‌ లాంటి క్రానిక్‌ అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు రాకుండా అరికడుతుంది.
 
బాదం పప్పుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తుంది. పీచుపదార్థాలు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ ఇందులో ఉంటాయి. బాదం పప్పులు తింటే గుండెకు ఎంతో మంచిది. వీటిల్లో ఉండే మోనోసాచ్యురేటెడ్‌ ఫ్యాట్‌ ఆరోగ్యవంతమైంది‌. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడానికి తోడ్పడుతుంది.
 
పచ్చరంగులో ఉండే బ్రొకోలీలో ఫైటోన్యూట్రియంట్స్‌తోపాటు విటమిన్‌- సి కూడా అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌-ఎ కూడా అధికంగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది.

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments