Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేశాక.. పొట్ట నిండిపోయేలా నీటిని తాగేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి..

శరీరానికి నీరే ఆధారం. నీటిని సక్రమంగా తీసుకోకపోతే.. ఒబిసిటీ ఆవహిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే అవయవాల పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నీటిని ఎప్పుడుపడితే అప్పుడు సేవించకూడద

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (15:48 IST)
శరీరానికి నీరే ఆధారం. నీటిని సక్రమంగా తీసుకోకపోతే.. ఒబిసిటీ ఆవహిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గితే అవయవాల పనితీరు మందగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే నీటిని ఎప్పుడుపడితే అప్పుడు సేవించకూడదని వారు చెప్తున్నారు. పరగడుపున రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. పరగడుపున తీసుకోవడం ద్వారా శరీరానికి శక్తి చేకూరుతుంది. ఇలా రోజూ చేస్తే శరీరంలోని మలినాలు వెలివేయబడుతాయి. 
 
అలాగే ఆహారం తీసుకునేందుకు అరగంట ముందు ఒక గ్లాసు నీరు సేవించాలి. ఇలా చేస్తే బరువు తగ్గుతారు. అయితే ఆహారం తీసుకున్న వెంటనే నీటిని సేవించడం మంచిది కాదు. ఆహారం తీసుకున్న వెంటనే పొట్ట నిండేలా నీటిని సేవిస్తే.. అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే భోజనం చేస్తున్నప్పుడు కూడా నీటిని తాగకూడదు. నీటికి బదులు మజ్జిగ తీసుకోవచ్చు. ఇది ఉష్ణాన్ని తగ్గించడంతో పాటు అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు కాసిన్ని నీరు సేవించండి. పది నిమిషాల తర్వాత ఆహారం తీసుకోండి. ఇలా చేయడం ద్వారా శరీర బరువును నియంత్రించుకోవచ్చు.  
 
నీరసంగా ఉన్నప్పుడు మన మెదడులో నీరు 75 శాతం మాత్రమే ఉందని గమనించాలి. మెదడు చురుగ్గా పనిచేయాలంటే తగినన్ని నీరు సేవించాలి. నీరసంగా ఉన్నప్పుడు తప్పకుండా నీటిని సేవించడాన్ని మరిచిపోకూడదు. అయితే సాయంత్రం పూట తక్కువ మోతాదులో నీటిని తీసుకోవాలి. వ్యాయామానికి ముందు వ్యాయామానికి అనంతరం నీటిని తీసుకోవడం ద్వారా కండరాలు బలపడతాయి.

అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు నీటిని సేవించడం మంచిది. గర్భిణీ మహిళలు, బాలింతలు అధికంగా నీటిని తీసుకోవాలి. కనీసం రోజుకు 10 గ్లాసుల నీటిని సేవించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మిగిలిన వారు రోజుకు 8 గ్లాసుల నీటిని తీసుకోవడం మంచిది.

పెండింగ్ బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేత

వాయుగుండంగా మారనున్న అల్పపీడనం... ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన

ఏపీలో కూలగొడుతున్న వైకాపా జెండా దిమ్మెలు!! (Video Viral)

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

తర్వాతి కథనం
Show comments