భోజనం చేసే సమయంలో చల్లటి నీటిని తాగవచ్చా..?

Webdunia
శుక్రవారం, 31 మే 2019 (16:05 IST)
మంచి నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజులో వీలైనంత వరకు నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీంతో చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతుంటారు. అందులోనూ చాలా చల్లగా ఉండే నీటిని తాగేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఎండకాలంలో అయితే దాహంగా ఉందని ఫ్రిజ్‌లో నుండి తీసిన నీటిని, అలాగే గడ్డకట్టిన నీటిని తాగుతుంటారు. 
 
ఇలా మరీ చల్లగా ఉండే నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. వేడి నీటి వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అదే చల్లటి నీరు అయితే చర్మ రంధ్రాలు మూసుకుపోతుంటాయి. మామూలుగా చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణాశయం కుచించుకుపోతుంది. అంతేకాదు చల్లటి నీరు జీర్ణమై రక్తంలో కలిసే వేగం తగ్గుతుంది. దీని కారణంగా ఒక్కోసారి డీహైడ్రేషన్‌కి గురవుతుంటాం. 
 
భోజనం చేస్తున్నప్పుడు లేదా తిన్న తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల ఆహారంలోని కొవ్వుపదార్థాలు గడ్డకట్టుకుపోతాయి. దీంతో జీర్ణాశయం స్థాయికి మించి పని చేయవలసి ఉంటుంది. కాబట్టి చల్లటి నీటి కంటే గోరువెచ్చని నీటిని తాగడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

తర్వాతి కథనం
Show comments