Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేనెను మితిమీరి సేవిస్తే ఏమవుతుందో తెలుసా?

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (17:22 IST)
తేనె. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐతే మోతాదుకి మించి తేనెను సేవిస్తే మాత్రం అది అనారోగ్యానికి కారణమవుతుంది. మితిమీరి తేనెను సేవిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాము.
చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం తేనె. ఐతే దీనిని ఎక్కువగా సేవిస్తే ఆరోగ్యానికి సమస్యలు తెస్తుంది. తేనెలో చక్కెర- కార్బోహైడ్రేట్లు పెద్దమొత్తంలో ఉన్నాయి. కాబట్టి తేనెను ఎక్కువగా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
 
రక్తపోటును నియంత్రించడంలో తేనె ఒక గొప్ప పదార్ధం. కానీ అధికంగా తీసుకుంటే అది తక్కువ రక్తపోటు లేదా హైపోటెన్షన్ ప్రమాదానికి గురి చేస్తుంది. శరీరం తేనెలోని చక్కెరలను జీర్ణం చేయలేకపోవడం వల్ల తేనె ఉబ్బరం లేదా విరేచనాలకు దారితీస్తుంది.
 
తేనెలో ఉండే అధిక కేలరీలు, చక్కెర, కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. దాదాపు 82% తేనె చక్కెరతో తయారు చేయబడింది, కనుక ఇది దంతాలను దెబ్బతీసే అవకాశం వుంటుంది. తేనెను రోజుకు 50 మి.లీ లేదా 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, అంతకంటే ఎక్కువ సేవించకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

తెలంగాణ సీఎం రేవంతన్నకు బహిరంగ లేఖ రాసిన కేవీపీ ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

తర్వాతి కథనం
Show comments