Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ వయసులో పిల్లల్ని కనాలో తెలుసా?

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (23:26 IST)
నేటి యువ‌తీయువ‌కులు పెళ్ళి, సంతానం కంటే త‌మ కెరీర్‌ను తీర్చిదిద్దుకునే విష‌యానికే అత్మంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్ళి, పిల్ల‌లు కంటే ముందు ఆర్థికంగా సెటిల్ కావాల‌ని... ఆ త‌ర్వాతే అన్నీ అని భావిస్తున్నారు. ఈ ఆలోచ‌న మంచిదే కానీ, ఇదే లైఫ్ ప్లానింగ్ కాదంటున్నారు వైద్య నిపుణులు. పెళ్ళి, పిల్ల‌ల్ని క‌న‌డం కూడా ప్లానింగ్‌లో భాగ‌మేన‌ని గుర్తించాలంటున్నారు. 
 
పిల్ల‌లు క‌న‌డానికి అనువైన వ‌య‌సు 18 నుంచి 24 సంవ‌త్స‌రాల‌ని సూచిస్తున్న‌ారు. పెళ్ళి ఆల‌స్యం అయ్యేకొద్దీ గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ట‌. 25 సంవ‌త్స‌రాలు దాటిన త‌ర్వాత గ‌ర్భం దాల్చే అవ‌కాశం త‌క్కువ‌. అంతేకాకుండా ఒక స‌ర్వే ప్ర‌కారం 25 నుంచి 31 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గ‌ల వివాహిత‌కు గ‌ర్భం దాల్చే అవ‌కాశం 26 శాతానికి ప‌డిపోతుంది. 31 నుంచి 35 సంవ‌త్సారాల లోపు వారికి 38 శాతానికి ప‌డిపోతుంది. 18 నుంచి 24 ఏళ్ళ లోపు వివాహితుల‌కు పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా, మంచి బ‌రువుతో పుడ‌తారు. 
 
27 సంవ‌త్స‌రాలు దాటితే, బిడ్డ బ‌రువులో చాలా తేడాలుంటాయ‌ట‌. కృత్రిమ గ‌ర్భం కోసం ప్ర‌య‌త్నించేవారు ఎక్కువ మంది 35 ఏళ్ళ వ‌య‌సు దాటిన వారే ఉంటారు. పురుషుడి వ‌య‌సు పెరుగుతున్నకొద్దీ వారిలో శుక్ర‌క‌ణాల‌ ఉత్ప‌త్తి త‌గ్గిపోతుంద‌ట‌. పైగా అండ ఉత్ప‌త్తి కూడా క్షీణిస్తూ, హార్మోన్ల‌లో మార్పులు సంభ‌విస్తాయి. అండ‌కోశాలు అండాన్ని హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంటాయి. అండాలు ఒక్క‌ొక్క‌టి ద్రాక్ష కాయంత ప‌రిమాణంలో ఉంటాయి. సుమారుగా ఒక అంగుళం నుంచి ఒటికన్న‌ర అంగుళం పొడ‌వు, వెడ‌ల్పు క‌లిగి ఉంటుంది. 
 
గ‌ర్భ సంచి మూడు అంగుళాల పొడ‌వు, రెండు అంగుళాల వెడ‌ల్పు ఉంటుంది. ఇది కండ‌రాల‌తో నిర్మిత‌మై ఉంటుంది. దీనిపై పొర‌ను మ‌యోమెట్రియం అంటారు. గ‌ర్భాశ‌యం లోప‌ల ప్ర‌త్యేక‌మైన పొర ఉంటుంది. దీన్ని ఎండోమెట్రియం అంటారు. గ‌ర్భం క‌లిగితే, గ‌ర్భ‌స్థ పిండం ఫెలోపియ‌న్ నాళం గుండా ప్ర‌యాణించి ఎండోమెట్రియంలో నాట‌ుకుంటుంది. అక్క‌డి ఆహారాన్ని తీసుకుంటూ గ‌ర్భ‌స్థ పిండం తొలినాళ్ళ‌లో పెరుగుతుంది. వ‌య‌సు పెరిగే కొద్ది గ‌ర్భ‌ధార‌ణ‌కు అనుమైన ఈ ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తుంది. అందుకే పెళ్ళికి తొంద‌ర ప‌డాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

తర్వాతి కథనం
Show comments