Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే...

మ‌న రోగాల్లో అతి ముఖ్య‌మైన‌ది వాతం. వాతాన్ని క్రమంలో ఉంచాలంటే శుద్ధమైన వంట నూనెలను వాడాలి. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనె. నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు జిగు

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (14:59 IST)
మ‌న రోగాల్లో అతి ముఖ్య‌మైన‌ది వాతం. వాతాన్ని క్రమంలో ఉంచాలంటే శుద్ధమైన వంట నూనెలను వాడాలి. శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండ్ నూనె. నూనెలో ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె వాడాలి. ఈ శుద్ధమైన నూనెకు వాసన ఎక్కువగా ఉంటుంది, బాగా జిగురు జిగురుగా ఉంటుంది. చిక్కగా మంచి వాసన వస్తూ ఉంటుంది. నూనెలో ఉండవలసిన ముఖ్య అంశం జిగురు పదార్ధం, ప్రోటీన్స్. ఆ జిగురును వేరు చేస్తే నూనె మిగలదు. నూనెలో వాసన రూపంలో ఉండే ఆర్గానిక్ కంటేంటే ప్రోటీన్స్, ఫ్యాటీ యాసిడ్స్. నూనెని రిఫైండ్ చేసినపుడు జిగురు, వాసన పోతాయి. ఇక లాభం ఏముంటుంది?
 
ఏ నూనెలో కూడా మంచి కొలెస్ట్రాల్, చెడ్డ కోలెస్ట్రాల్ ఉండదు. మనం తీసుకొనే ఆహారం, నూనెల నుండి మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్ తయారవుతుంది. మనం శుద్ధమైన నూనె (Non Refined Oil) తీసుకున్నప్పుడు మన శరీరంలో లివర్ సహాయంతో మంచి కొలెస్ట్రాల్ (H.D.L.) ఎక్కవ మోతాదులో తయారవుతుంది. శుద్ధమైన నూనె వాడి జీవితాంతం ఆరోగ్యంగా ఉండండి. 
 
భారతదేశంలో 50 సంవత్సరాలకు పూర్వం వరకు ఈ రిఫైండ్ ఆయిల్ లేదు. రిఫైండ్ నూనె చేసేటప్పుడు 6 రకాల హానికరమైన కెమికల్స్, డబుల్ రిఫైండ్ చేసేటప్పుడు 13 రకాల హానికరమైన కెమికల్స్ వాడ‌తారు. ఈ కెమికల్స్ ముందుముందు మన శరీరంలో వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి. ఈ రిఫైండ్ ఆయిల్‌లో మన శరీరానికి కావలసిన జిగురు, వాసన , ప్రోటీన్స్ , ఫ్యాటీ యాసిడ్స్ ఏవీ ఉండవు.  
 
వాతాన్ని నివారించటానికి శుద్ధమైన నూనె, పిత్తాన్ని నివారించటానికి దేశవాళి ఆవు నెయ్యి, కఫంను సక్రమంగా ఉంచాలంటే అన్నింటికన్నా ఉత్తమమైనది బెల్లం, తేనె. కుస్తీపట్లు, దండీలు, బస్కీలు తీసేవారికి మాత్రమే గేదె నెయ్యి మంచిది.  
 
రోగాలకు రాజు వాత రోగాలు. 
జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే శుద్దమైన నూనెలు ( Non -Refined ) వేరు శెనగ నూనె, కొబ్బెర నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె ఆవాల నూనెలు మాత్రమే వాడాలి. 
 
ప్రొద్దుతిరుగుడు పూల విత్తనాలు గేదెలకు, పశువులకు మాత్రమే పెట్టదగినవి. మనకు ఏ మాత్రం ఈ స‌న్ ప్ల‌వ‌ర్ ఆయిల్ వాడదగినది కాదు, ఆరోగ్యకరం అస‌లే కాదు. రిఫైండ్ ఆయిల్స్ ఎంతమాత్రం వాడతగినవి కాదు.  
 
సోయా బీన్స్, సోయా బీన్స్ ఆయిల్, సోయాబీన్ పాలు ఏ మాత్రము వాడరాదు. పందులు తినతగినవి ఈ సోయాబీన్స్, ఎందుకంటే పందులు మాత్రమే వీటిని తిని జీర్ణించుకోగలవు. కావున వీటిని వాడరాదు. వీటిని వాడితే మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి.
 
పామోలిన్ ఆయిల్ కూడా చాలా హానికరం. వీటిని వాడుతున్నవారికి మొదట మలబద్దకం వస్తుంది. ఈ మలబద్దకమే అన్ని రోగాలకు మూలం. ప్రస్తుతము చాలా రోగాలకు మూలం ఈ పామోలిన్ అయిల్. ఈ పామోలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేధించారు. ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments