Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలం.. బొప్పాయిలో బోలెడు ప్రయోజనాలు.. వ్యాధినిరోధక శక్తి కోసం?

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (20:35 IST)
కరోనా కాలం మొదలైనప్పటి నుంచి రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలపై ప్రజలు దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే ఆయుర్వేదం ప్రకారం ఆహారపు అలవాట్లలో జనం మార్పులు చేసుకున్నారు. తేనె, అల్లం, మిరియాలు అంటూ ఆహారంలో ఈ పదార్థాలను భాగం చేసుకుంటున్నారు. అలాగే బొప్పాయిని కూడా కోవిడ్ వ్యాపిస్తున్న తరుణంలో ఆహారంలో భాగం చేసుకుంటే.. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
బొప్పాయిలో బోలెడంత ఫైబర్ ఉంటుంది. ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, సి, బి, ఈ, కే, పొటాషియం వంటివి ఇందులో ఉన్నాయి. బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లెమ్యాటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. బొప్పాయి పండు మాత్రమే కాదు, ఆకులు కూడా ఆరోగ్యకరమేనని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ట కౌంట్ పెంచేందుకు ఆకులు ఉపయోగపడతాయని వారు చెప్తున్నారు. 
 
బొప్పాయి పండు జీర్ణశక్తిని పెంపొందించడంలో కీలకంగా పనిచేస్తుంది. బొప్పాయి రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదం చేస్తుంది. ఎందుకంటే.. అత్యధిక రోగ నిరోధక కణాలన్నీ ఆంత్రము లేదా పెద్ద, చిన్న పేగుల్లోనే ఉంటాయి. బొప్పాయి వల్ల అవి ఆరోగ్యంగా ఉండి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

నిత్యానంద నిజంగా చనిపోయారా? సోషల్ మీడియాలో వీడియో హల్చల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments