ఒత్తిడి అధికమైతే.. రోజూ మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోండి

పనిలో ఒత్తిడి అధికమైందా? ఆందోళన వేధిస్తుందా? అయితే వెంటనే ఓ కప్పు పెరుగును రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది. పెరుగును రోజు ఒకకప్పు తీసుకుంటే ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.

Webdunia
శనివారం, 1 జులై 2017 (12:12 IST)
పనిలో ఒత్తిడి అధికమైందా? ఆందోళన వేధిస్తుందా? అయితే వెంటనే ఓ కప్పు పెరుగును రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది. పెరుగును రోజు ఒకకప్పు తీసుకుంటే ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. మానసిక ఆందోళనను తగ్గించే గుణం పెరుగులో ఉందని పరిశోధనలో తేలింది.

పెరుగు తింటే డిప్రెషన్ తగ్గిపోతుందట. ఇందులో ఎక్కువగా ఉండే లాక్టోబాసిల్లిస్‌ అనే బ్యాక్టీరియా ఒత్తిడిని, డిప్రెషన్‌ను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెరుగులో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 
 
బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు దివ్యౌషధం లాంటిది. రాత్రి పూట అన్నంలో పెరుగును చేర్చి.. ఉదయం కొత్తిమీర, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల బక్కపలచగా ఉన్న వారు పుష్టిగా తయారవుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది.  అంతేకాదు శరీరానికి కాంతినిస్తుంది. ఇక గర్భిణులకు చాలా మంచిది. కానీ అధికంగా తీసుకుంటే వాతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే రోజుకో కప్పు చొప్పున పెరుగును మధ్యాహ్నం పూట భోజనంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments