Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో కీరదోసకాయను రోజూ తినండి.. లేకుంటే?

వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మార్చిలోనే మండిపోతున్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. పానీయాలను అధికంగా తీసుకోవాలి. జ్యూస్‌లు, పండ్లు, కొబ్బరి నీరును సేవిస్తుండాలి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోసన

Webdunia
శనివారం, 10 మార్చి 2018 (19:03 IST)
వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మార్చిలోనే మండిపోతున్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా వుండాలంటే.. పానీయాలను అధికంగా తీసుకోవాలి. జ్యూస్‌లు, పండ్లు, కొబ్బరి నీరును సేవిస్తుండాలి. ముఖ్యంగా ఎండాకాలంలో కీరదోసను తప్పక తీసుకోవాలి. లేకుండే శరీరం డీ-హైడ్రేషన్‌కు లోనవుతుంది. కీరలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. 
 
కీరను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరం తేమను కోల్పోదు. పొట్ట శుభ్రపడుతుంది. కిడ్నీలోని రాళ్లను కరిగించడంలో బాగా పనిచేస్తుంది. వేసవిలో ప్రతిరోజూ రెండు గ్లాసుల కీరదోస జ్యూస్ తాగితే అల్సర్ దూరమవుతుంది. వేసవిలో పండ్లతో చేసిన సలాడ్స్‌లో కీర ముక్కలు తీసుకోవడం మంచిది. కీరదోసలో పాస్పరస్‌, విటమిన్లు, పోటాషియం, నీటి శాతం, మెగ్నీషియం, మినరల్స్‌, జింక్‌, ఐరన్‌, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. 
 
చర్మాన్ని సంరక్షించే ఎన్నో రకాల ఔషధ గుణాలు కీరదోసకాయల్లో ఉన్నాయి. కీరతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలు తక్కువ ఉండడం చేత కీరదోసకాయ బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. దృష్టి సంబంధ సమస్యలను కీరదోసకాయ దూరం చేస్తుంది. కళ్ల కింద ఏర్పడే నల్లని వలయాలను కీరదోస దూరం చేస్తుంది. మధుమేహం, కొలెస్ట్రాల్‌లను తగ్గించేందుకు కీరదోస ఉపయోగపడుతుంది. దీన్ని నిత్యం తీసుకుంటే బీపీ కూడా అదుపులోకి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

తర్వాతి కథనం
Show comments