Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు సరికొత్త డ్రింక్ క్రాఫ్ట్ బీర్.. తాగితే ఆరోగ్యంగా ఉంటారట!

మందు బాబులకు క్రాఫ్ట్ బీర్ అంటే ఏమిటో తెలిసే ఉంటుంది. ఈ బీరులను పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసేది కావు. చిన్నచిన్న కంపెనీలే బీరు తాగేవారి టేస్టుకు తగ్గట్లు ట్రెడిషనల్‌గా తయారు చేసేది ఈ క్రాఫ్ట్ బీర్.

Webdunia
సోమవారం, 8 ఆగస్టు 2016 (09:22 IST)
మందు బాబులకు క్రాఫ్ట్ బీర్ అంటే ఏమిటో తెలిసే ఉంటుంది. ఈ బీరులను పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసేది కావు. చిన్నచిన్న కంపెనీలే బీరు తాగేవారి టేస్టుకు తగ్గట్లు ట్రెడిషనల్‌గా తయారు చేసేది ఈ క్రాఫ్ట్ బీర్. పబ్బుల్లోనూ, క్లబ్బులు, ఇంటి అవసరాలకోసం దీన్ని విరివిగా వినియోగిస్తారు. కానీ ఈ విదేశాల్లో క్రాఫ్ట్ బీర్స్ వాడకం ఎక్కువ. ఇప్పుడు భారత్‌లోనూ ఆ ట్రెండ్ నడుస్తోంది. 
 
మందుబాబుల అవసరాలను అర్థం చేసుకున్న ముంబై, పుణెల్లోని కొన్ని చిన్న బీరు పరిశ్రమలు 'క్రాఫ్ట్ బీరు' పేరుతో కొత్త రకం బీరును తయారు చేశారు. ఈ క్రాఫ్ట్ బీరులో కూడా మామూలు బీరులో వాడే మాల్ట్, హాప్స్, ఈస్ట్, నీరు ఇతర పదార్థాలను కలిపి ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు లేకుండా సహజమైన పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఈ రకంగా తయారైన ఈ క్రాఫ్ట్ బీరును తాగటం వల్ల అనారోగ్యంతో ఉన్నవారికి కూడా వారి ఆరోగ్యం చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 
 
అయితే మామూలు బీర్‌తో పోల్చితే ఈ క్రాఫ్ట్ బీర్ ధర ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు సాధారణ బీరు కన్నా ఇది ఎక్కువ నాణ్యతతో, కృత్రిమ రుచులు కలపకుండా సహజసిద్ధంగా ఉంటుంది. దీనిలో పోషక విలువలు కూడా అధిక స్థాయిలో ఉన్నాయి. బీరు తాగితే అనారోగ్యం వస్తే.. క్రాఫ్ట్ బీరు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే ఇది ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదు. 
 
లెసైన్సులు పొందడం నుంచి మద్యం దుకాణాలకు పంపిణీ వరకు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, క్రాఫ్ట్‌బీరుకు ప్రచారం కల్పించే పనిలో తయారీదారులు ముమ్మరంగా ఉన్నారు. సాధారణ బీరుతో పోలిస్తే క్రాఫ్ట్‌బీరు ధర కాస్త ఎక్కువేననీ, ముడిసరుకుల అధిక ధరలే ఇందుకు కారణమని తయారీదారులు వివరించారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

తర్వాతి కథనం
Show comments