Webdunia - Bharat's app for daily news and videos

Install App

COVID-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి ఎందుకు జ్వరం వస్తుంది?

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (22:25 IST)
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కొందరికి జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం చూస్తున్నాం. ఈ రోగనిరోధక ప్రతిస్పందన వ్యాక్సిన్‌లో ఉన్న యాంటిజెన్ ద్వారా ప్రేరేపించబడుతుంది. శరీరంలోని రక్షణాత్మక రోగనిరోధక కణాల ప్రసరణను పెంచడానికి శరీరంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రత పెరుగుదలకు దారి తీస్తుంది, తత్ఫలితంగా జ్వరంగా బయటపడుతుంది.
 
ఈ దుష్ప్రభావాలు సాధారణమేనా?
ఈ రోజుల్లో చాలాచోట్ల వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే- వ్యాక్సిన్‌లతో సంబంధం ఉన్న దుష్ప్రభావాలు ఏమిటి? అవి ఆందోళనకు కారణం అవుతాయా? 
 
టీకా తర్వాత కొద్ది రోజులు తేలికపాటి నుండి మితమైన దుష్ప్రభావాలు కనబడతాయి. ఈ ప్రభావాలు కొన్ని రోజుల్లో వాటంతట అవే పోతాయి. టీకాలు వేసిన వ్యక్తులలో సాధారణంగా గమనించబడే కొన్ని దుష్ప్రభావాలు-

 
జ్వరం, వళ్లు నొప్పులు, టీకాలు వేసిన ప్రదేశంలో నొప్పి, ఎరుపు మరియు వాపు, తలనొప్పి
చలి, వికారం.

 
టీకా తీసుకున్నవారిలో ఈ దుష్ప్రభావాలు సాధారణం. టీకా మోతాదు ఇచ్చిన తర్వాత, ఆరోగ్య కార్యకర్తలు టీకా వేసుకున్నవారిని టీకా ఇచ్చిన స్థలంలో 15 నుండి 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచుతారు. వ్యాక్సిన్‌కు ఏదైనా తక్షణం ఊహించని సమస్య వస్తే ఆరోగ్య సంరక్షణ నిపుణులు నిర్ధారించుకోవడానికి ఇలా చేస్తారు.

 
సైడ్ ఎఫెక్ట్స్ గుర్తులు ఏంటంటే?
రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా స్పందిస్తుందని, టీకా పని చేస్తుందని చూపించేవే సైడ్ ఎఫెక్ట్స్ గుర్తులు. కొన్ని రోజుల్లో ప్రభావాలు తీవ్రత తగ్గుతాయి. వ్యాక్సిన్‌లు సురక్షితమైనవి. COVID-19 నుండి రక్షణ కోసం అవి మీకు ఉత్తమమైనవి. మీరు పూర్తిగా టీకాలు వేసే వరకు సూచించిన మార్గదర్శకాలను అనుసరించడం చాలా అవసరం. కొంత సమయం తర్వాత మీరు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చూసుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

విడాకులు కోరిన భార్య... ప్రైవేట్ వీడియోలు షేర్ చేసిన భర్త!!

అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం... ఫైజాబాద్ ఎంపీ కంటతడి...!!

Battula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అరెస్ట్ (video)

పడకపై ఉండగానే చూశారనీ ప్రియుడితో కలిసి పిల్లలను చితకబాదిన తల్లి

బెయిలుపై విడుదలై 64 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

Casting Couch: స్టార్ హీరో నుంచి ఆఫర్ వచ్చింది.. డ్రెస్సా-బికినీయా అనేది నా నిర్ణయం

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

తర్వాతి కథనం
Show comments