Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం సేవిస్తూ అవి తింటే గుండెపోటు ఖాయం, ఏంటవి?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (22:59 IST)
మద్యం పుచ్చుకోవడం ఇటీవల సాధారణమైన విషయంగా మారిపోయింది. ఇదివరకు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మద్యం దుకాణాలుండేవి. ఇప్పుడు మెయిన్ రోడ్డు ప్రక్కనే దర్జాగా కుర్చీల్లో కూర్చుని మద్యం బాటిళ్లను ఎదురుగా పెట్టుకుని తాగేస్తున్నారు. వీటితో పాటు సైడ్ డిష్‌గా మసాలాతో దట్టించిన పదార్థాలను కొందరు తింటే మరికొందరు వారికి ఇష్టమైనవవి తీసుకుంటూ వుంటారు. ఐతే కొన్ని పదార్థాలను మద్యంతో పాటు సేవిస్తే గుండెపోటు రావడం ఖాయం అంటున్నాయి పలు అధ్యయనాలు.
 
మద్యం సేవిస్తూ వేయించిన వేరుశెనగ పప్పు, లేదంటే పొడి జీడిపప్పు తినడం చాలామంది చేస్తుంటారు. కానీ వీటిని మద్యంతో పాటు తినరాదంటున్నారు. ఎందుకంటే వేరుశెనగ, జీడిపప్పులో కొలెస్ట్రాల్ అధికం. ఈ కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా హానికరం. కొలెస్ట్రాల్ పెరగితే గుండెపోటు ప్రమాదం కూడా పెరుగుతుంది. కనుక వాటిని తీసుకోకపోవడం మంచిదంటున్నారు.
 
మరికొందరు సోడా లేదా కోల్డ్ డ్రింక్‌తో పాటు మద్యం సేవిస్తుంటారు. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఎలాగంటే ఆల్కహాల్‌లో సోడా లేదా శీతల పానీయం కలిపి తాగడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఫలితంగా శరీరం పట్టుతప్పి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 
మద్యంతో పాటు జున్ను ముక్కలు తింటారు కొందరు. పాల ఉత్పత్తులతో తయారైన వస్తువులను మద్యం సేవించే సమయంలోనే కాదు ఆ తర్వాత ఒక గంట సమయం వరకు తినరాదు. పాలతో చేసిన వస్తువులను తినడం వల్ల జీర్ణక్రియను దెబ్బతీసి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే మద్యం సేవిస్తున్న సమయంలోగానీ లేక ఆ తర్వాత ఒక గంటసేపు వరకు తియ్యని పదార్థాలు తినకూడదు. మద్యంతో తీపి తింటే మత్తును రెట్టింపు చేస్తుంది. దీనితో, వ్యక్తి తన నియంత్రణ కోల్పోయే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెపుతున్నారు. కనుక మందుబాబులు తస్మాత్ జాగ్రత్త. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sajjanar: ఇలాంటి ప్రమాదకరమైన ప్రయాణాలు అవసరమా?: సజ్జనార్ ప్రశ్న

Shyamala: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుపై యాంకర్ శ్యామల ఫైర్

Taj Hotel: తాజ్ హోటల్, ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు

సింగపూర్‌లో స్విమ్మింగ్-12 ఏళ్ల బాలికను వేధించాడు.. చిప్పకూడు తింటున్నాడు..

బావ పొందు కోసం భర్తను రూ.50,000 సుపారి ఇచ్చి హత్య చేయించిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

ఫ్యామిలీ విందులో పవన్ కళ్యాణ్ పాట పాడిన విజయ్ దేవరకొండ

హ్రుతిక్ రోషన్ ఎంత పనిచేశాడు - నీల్ సినిమా అప్ డేట్ బ్రేక్ పడింది

Nayanthara: మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి చిత్రంలో నయనతార ఫిక్స్

తర్వాతి కథనం
Show comments