Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము చుట్టు కొలత.. బొజ్జ తగ్గాలంటే.. కొబ్బరి తినాల్సిందే..

బరువును తగ్గించడంలో కొబ్బరి భేష్‌గా పనిచేస్తుంది. కొబ్బరి వాడకం వల్ల వెంట్రుకలు, చర్మం ఆరోగ్యంగా, అందంగా తయారవుతాయి. చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యంగా వుంటుంది. అలాగే బొజ్జ చుట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌న

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (10:41 IST)
బరువును తగ్గించడంలో కొబ్బరి భేష్‌గా పనిచేస్తుంది. కొబ్బరి వాడకం వల్ల వెంట్రుకలు, చర్మం ఆరోగ్యంగా, అందంగా తయారవుతాయి. చర్మం ముడతలు పడకుండా ఆరోగ్యంగా వుంటుంది. అలాగే బొజ్జ చుట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌ను కొబ్బరి దూరం చేస్తుంది. పొట్టచుట్టూ చేరిన ప్రమాదకర ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. రోజూ 200 గ్రాముల కొబ్బరి చొప్పున పన్నెండు వారాల పాటు క్రమం తప్పకుండా తింటే బిఎంఐతో పాటు నడుం చుట్టుకొలత కూడా తగ్గుతుంది.
 
కొబ్బరి శరీరంలోని ఫ్యాట్‌ను కరిగించి ఎనర్జీని పెంచుతుంది. శరీరాన్ని ఎల్లవేళలా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పాలలో కన్నా కొబ్బరి నీళ్లల్లో పోషకవిలువలు, ఆరోగ్య సుగుణాలు అధికంగా ఉన్నాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లను కొబ్బరి తగ్గిస్తుంది. ఎసిడిటీ, గుండెల్లో మంటలను నిరోధిస్తుంది.
 
ఎన్నో పోషకవిలువలు ఉన్న కొబ్బరినీళ్లు గర్భిణీలకు చాలా మంచిది. కడుపులోని బిడ్డతో పాటు తల్లికి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ కొబ్బరి తినడం వల్ల ఎముకలు పటిష్టంగా పెరగడంతో పాటు దంతాలు దృఢంగా తయారవుతాయి. చర్మంలోని పొడారిపోయే గుణాన్ని కొబ్బరి నూనె నిరోధిస్తుంది.
 
స్వచ్ఛమైన కొబ్బరినూనె వాడడం వల్ల జుట్టు రాలదు. కొబ్బరినీళ్ల వల్ల కూడా ఈ సమస్యను అధిగమించవచ్చు. కొబ్బరిలోని యాంటీ-బ్యాక్టీరియల్‌, యాంటి- ఫంగల్‌ సుగుణాలు తలలో చుండ్రును నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments