Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 యేళ్లకే సెక్స్ తొలి అనుభవం రుచిచూస్తున్న నగర బాలికలు : స్టడీ రిపోర్ట్

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2015 (15:47 IST)
నవరసాలలో ఒక రసం శృంగారం. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించింది శృంగారమని మన పెద్దలు. అలాంటి శృంగారం పట్ల నేటి యువత అమితంగా ఆకర్షితులవుతోంది. ఫలితంగా బాలికలు 14 యేళ్ళకు, బాలురు 16 యేళ్ళకే తమ తొలి సెక్స్ అనుభవాన్ని రుచిచూస్తున్నట్టు తేలింది.


ఈ వయస్సు వారిలో 14.09 శాతం మంది బాలికలు, 13.72 శాతం మంది బాలురు శారీరక సంబంధం కలిగివున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ సర్వేను 20 నగరాల్లో 13 నుంచి 19 యేళ్ళ మధ్య యువతీయువకుల్లో 15 వేల మంది వద్ద నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 8.9 శాతం మంది కనీసం ఒక్కసారి అయిన సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు వెల్లడించారు. 
 
అంతేకాకుండా, సర్వేలో పాల్గొన్న వారిలో 6.3 శాతం యువకులు, 1.3 శాతం బాలికలు కనీసం ఒక్కసారి అయినా శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపారు. ఇలా తొలి అనుభవం రుచిచూసిన బాలికల సగటు వయస్సు 14 యేళ్ళుగా ఉండగా, బాలుర వయస్సు 16 యేళ్లుగా ఉన్నట్టు మెడిఏంజెల్స్ డాట్ కామ్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చే ఈ-హెల్త్‌కేర్ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్టు ప్రముఖ ఆంగ్ల పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. చిరుప్రాయంలోనే సెక్స్‌లో పాల్గొనడానికి ప్రధాన కారణం శృంగారం పట్ల తగిన అవగాహన లేకపోవడమేనని ఈ సర్వేలో తేలింది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల