Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారం.. కారం.. అనకండి.. కాస్త తినండి..

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (13:49 IST)
కారం.. కారం.. అంటూ ఆహారాన్ని పక్కనబెట్టేస్తున్నారా? కారంగా వుంటే కాస్త తినండి అంటున్నారు.. వైద్యులు. కారాన్ని ఆహారంలో కొంచెం అయినా తీసుకోవాలి. మోతాదుకు మించి కారం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కారం అనేది డైట్‌లో తప్పకుండా వుండాలని చెప్తున్నారు న్యూట్రీషియన్లు. 
 
ఎందుకంటే..? ఎండు మిర‌ప‌కాయ‌ల పొడిలో ఉండే ప‌లు ర‌కాల స‌మ్మేళ‌నాలు ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయ‌ని తాజా పరిశోధనలో వెల్లడి అయ్యింది. కారం తిన‌డం వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ మెరుగు ప‌డుతుంది. 
 
గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో కారాన్ని ఆహారంలో చేర్చుకోవాలి. కొంచెం ఘాటుగా వున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ద‌గ్గు, జ‌లుబును దూరం చేసుకోవచ్చు. ఈ రెండూ ఉన్న‌వారు కారం తింటే త్వ‌ర‌గా ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శమ‌నం ల‌భిస్తుంది. 
 
మిర‌ప‌కాయ‌ల్లో ఉండే క్యాప్సెయిసిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం అధిక బ‌రువు త‌గ్గించ‌డంలో స‌హాయ ప‌డుతుంది. వాపుల‌ను తగ్గిస్తుంది. త‌ల‌నొప్పి, కీళ్ల నొప్పులు ఉన్న‌వారు కారం తింటే ఆయా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments