Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యారెట్‌ను నమిలి తింటే మేలెంత..? రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌లో?

క్యారెట్‌లో ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్‌ను రోజుకొకటి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు తొలగించబడతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. డ్రై స్కిన్ కలవారు క్యారెట్

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (16:28 IST)
క్యారెట్‌లో ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్‌ను రోజుకొకటి తీసుకుంటే కడుపులోని నులిపురుగులు తొలగించబడతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. డ్రై స్కిన్ కలవారు క్యారెట్ జ్యూస్‌లో తేనె లేదా ఆలివ్ ఆయిల్ కలుపుకుని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.  
 
ఇంకా క్యారెట్‌లోని విటమిన్ ఎ కంటికి ఎంతో మేలు చేస్తుంది. దృష్టి లోపాలకు చెక్ పెడుతుంది. సన్ టాన్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. క్యారెట్ క్రిములపై పోరాటం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వాపు, నొప్పులకు క్యారెట్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్‌లో కాసింత ఏలకుల పొడి, పటికబెల్లం చేర్చి తీసుకుంటే.. ఉత్సాహం చేకూరుతుంది. నీరసం, అలసట దూరమవుతుంది.  
 
నాలుక, గొంతు, పేగుల్లో ఏర్పడే క్యాన్సర్ కారకాలను నిర్మూలిస్తుంది. అల్సర్‌కు చెక్ పెడుతుంది. క్యారెట్ తురుముకు ఉప్పు, అరస్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర తరుగు, పులుపు లేని పెరుగును చేర్చి తీసుకుంటే కడుపులో మంట తగ్గుతుంది. ఎముకలు, దంతాలు, చర్మం, కంటికి క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్‌ను నమిలి తింటే.. నోటిలోని క్రిములు నశిస్తాయి. దంతాలు, చిగుళ్ళు బలపడతాయి. నోటిపూత నయం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.   

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

తర్వాతి కథనం
Show comments