Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాలాలు తీసుకుంటే.. మజ్జిగ తప్పనిసరిగా తాగాల్సిందేనా?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (14:04 IST)
ఇటీవల చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిలో గ్యాస్ సమస్య ఉంటోంది. మసాలాలు ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ సమస్యకు అవకాశం ఇచ్చినట్లే. మసాలాలు తీసుకుంటే తప్పనిసరిగా మజ్జిగ తాగాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్‌ ఆమ్లం కడుపులోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
 
ఇది అసిడిటీ సమస్యను కూడా తగ్గిస్తుంది. అయితే పుల్లటి మజ్జిగ కంటే, తియ్యటి మజ్జిగ తాగడం మేలు చేస్తుంది. పచ్చని తులసి ఆకులను వేడి నీటిలో మరిగించుకుని కాసేపు చల్లార్చి ఆ నీటిని తీసుకోవాలి. ఇలా వారం పది రోజులు చేస్తే గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్ నుండి ఉపశమనంతోపాటు శరీరానికి వెంటనే శక్తి కావాలంటే కొబ్బరి నీరు తీసుకోండి. 
 
గ్యాస్‌ను నివారించడంలో బెల్లం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. బెల్లంలోని మెగ్నీషియం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కాల్షియంని కూడా అందించి ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇకపోతే ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి.

ఆ పాత్రకు మూతపెట్టి రాత్రంగా అలానే ఉంచాలి. ఉదయాన ఆ నీటిలో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా మూడు పూటలా చేస్తే అసిడిటీ సమస్యను ఎదుర్కోవచ్చని ఆయుర్వేద నిపుణుల సలహా.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments