Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో అతిగా తినకండి.. అతిగా తిరగకండి.. కాటన్ దుస్తులు బెటర్

వేసవి కాలంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే.. అనారోగ్య సమస్యలతో పాటు వడదెబ్బకు గురయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో అతిగా బయట తిరగడం.. అతిగా తినడం తగ్గించాలి. వేసవిలో

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (13:49 IST)
వేసవి కాలంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోతే.. అనారోగ్య సమస్యలతో పాటు వడదెబ్బకు గురయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో అతిగా బయట తిరగడం.. అతిగా తినడం తగ్గించాలి. వేసవిలో ప్రత్యేక దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు అన్నింటికంటే బెటర్.  పాలిస్టర్‌, టెరీకాటన్‌, పట్టునైలాన్‌, షిఫాన్‌ వంటితో తయారయ్యే దుస్తులను అస్సలు ధరించకూడదు. 
 
ఇంకా వేసవిలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది కాదు. వేసవిలో ఎక్కడైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ముదురురంగు వస్త్రాలను, దుస్తులనుగానీ ఉపయోగించరాదు. లేత రంగు లేదా తెలుపు రంగులను ధరిస్తే ఎండ వేడిని గ్రహించుకోవు కాబట్టి వాటిని ఉపయోగించడం మంచిది.
 
ఇక మహిళలు శరీరాన్ని పూర్తిగా కప్పే జాకెట్లు వాడకూడదు. వేసవిలో అలంకరణల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. నూనె పదార్థాలు తినటం అస్సలు మంచిది కాదు. నీటిని ఎక్కువగా తీసుకోవాలి. 
 
ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవాలంటే బాదం మిల్క్‌, ఫ్లేవర్డ్‌ మిల్క్‌ వంటివి తీసుకోవచ్చు. మజ్జిగనీళ్ళు, పచ్చి ఉల్లిపాయలు మేలు చేస్తాయి. తేనె కలిపిన నిమ్మరసం వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవిలో రెండుపూటలా చన్నీళ్ళ స్నానం చేయాలి. ఇలా చేస్తే వేసవిలో చికాకు తప్పుతుంది.

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

తర్వాతి కథనం
Show comments