Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంది కదా అని దానిని ఎక్కువ వాడితే?

Webdunia
మంగళవారం, 25 జూన్ 2019 (21:11 IST)
గోరువెచ్చని నీటిలోకి నిమ్మరసం, తేనె  కలుపుకుని తాగితే మంచిదని అందరికీ తెలుసు. కాని దేనికి ఎంత వరకు ప్రాధాన్యమివ్వాలో, ఎలా తాగాలో చాలామందికి తెలియదు. ఈ ఫార్ములా మంచిదే కదా అని కొందరు అధికంగా నిమ్మరసాన్ని వాడుతుంటారు. అలా చేస్తే పులుపు పండ్ల చిగుళ్లు దెబ్బతింటాయి.
 
అందుకే.. సగం నిమ్మపండుకంటే ఎక్కువ వాడకూడదు. నిమ్మకు బరువు తగ్గించే గుణం ఉంది కదా అని దానిని ఎక్కువ వాడితే ఎసిడిటీ వృద్ధి చెందుతుంది. అది చేసే అసలు పనికి ఆటంకం ఏర్పడుతుంది. మోతాదుకు మించి వాడొద్దు. వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగే ముందు.. మామూలు నీళ్లతో నోటిని రెండుమూడుసార్లు పుక్కిలించిన తర్వాతే తాగాలి. లేదంటే బ్రెష్ చేసుకుని తాగితే ఇంకా మంచిది. లేకపోతే నోట్లోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లే ప్రమాదం ఉంది. 
 
చాలామంది జిమ్, జాగింగ్ వెళ్ళినప్పుడు దుకాణాల్లో బాటిళ్లలో విక్రయించే నిమ్మరసం తాగుతుంటారు. ఆరోగ్యానికి అది ఏమాత్రం మంచిది కాదు. ఇంట్లోనే సహజమైన నిమ్మకాయలను పిండుకున్న నీటిని తాగితేనే బెటర్. నీళ్లు నిమ్మరసంలోకి మోతాదుకు మించి తేనెను కలుపకూడదు. కొందరైతే వేడినీటి నీటిలోకి తేనెను కలిపేస్తుంటారు. ఈ అలవాటూ ఆరోగ్యకరమైనది కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తర్వాతి కథనం
Show comments