పచ్చి మిరపకాయలతో ఆరోగ్యం.. రోజూ తింటే..

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (10:05 IST)
Mirchi
భారతీయులు స్పైసీ ఫుడ్స్ తినడానికి ఇష్టపడతారు. అందుకే పచ్చి మిరపకాయలను ప్రతి ఆహారంలో ఉపయోగిస్తారు. పచ్చిమిర్చిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
పచ్చిమిర్చిలో ఉండే గుణాలు అనేక రకాల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. మిరపకాయలో ఉండే గుణాలు శరీరానికి చాలా పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజూ పచ్చిమిర్చిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి తినడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్: పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రించగలదు. అంతేకాదు, రక్తంలో కొలెస్ట్రాల్ చేరడం వల్ల కలిగే అధిక రక్తపోటును కూడా ఇది సులభంగా ఉపశమనం చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకునే వారు ప్రతిరోజూ పచ్చిమిర్చిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి.
 
క్యాన్సర్ నుండి రక్షిస్తుంది: ప్రతిరోజూ పచ్చిమిర్చి తీసుకునేవారిలో క్యాన్సర్ ముప్పు 50 శాతం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాకుండా పచ్చిమిర్చి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 
దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం: చాలా మందికి తరచుగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. దీని వల్ల కొంత మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. కానీ అలాంటి వారికి పచ్చిమిర్చి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
 
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: చలికాలంలో ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అలాంటివారు ప్రతిరోజూ పచ్చిమిర్చిని ఆహారంలో తీసుకోవాలి. దీని గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని ఉపశమనం చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

యూపీలో దారుణం : అనుమానాస్పదంగా నేవీ అధికారి భార్య మృతి

దక్షిణ కోస్తా - రాయలసీమను వణికిస్తున్న దిత్వా తుఫాను - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

సర్పంచ్ ఎన్నికల ఫీవర్ : ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

తర్వాతి కథనం
Show comments