Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రేక్ ఫాస్ట్‌లో బీన్స్, మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఫలితం ఏమిటి?

బ్రేక్ ఫాస్ట్ మానేసిన మహిళలకైతే ఉద్యోగ జీవితంలో విధుల నిర్వహణలో తెలియని ఒకరకమైన చిరాకు వేధిస్తుంది. అదే చిన్నపిల్లలైతే స్కూల్లో చురుకుదనంతో ఉండరు. కాబట్టి, ఉదయంపూట తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ ప్రతి ఒక్

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:17 IST)
బ్రేక్ ఫాస్ట్ మానేసిన మహిళలకైతే ఉద్యోగ జీవితంలో విధుల నిర్వహణలో తెలియని ఒకరకమైన చిరాకు వేధిస్తుంది. అదే చిన్నపిల్లలైతే స్కూల్లో చురుకుదనంతో ఉండరు. కాబట్టి, ఉదయంపూట తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ ప్రతి ఒక్కరికీ అవసరం. ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో బీన్స్‌, మొలకెత్తిన గింజలు లాంటివి తీసుకునేవారు చాలా చురుగ్గా ఉంటారు. చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
బ్రేక్ ఫాస్ట్‌లో పాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పీచు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు, ఆకుకూరలు లాంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇకపోతే, పొద్దున్నే బేకరీలలో తయారైన వస్తువులను తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇవి ఫాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయకపోవడమే కాకుండా, వీటిలోని క్యాన్సర్‌ కారకాలు శరీరానికి హాని చేస్తాయి.
 
అలాగే మధ్యాహ్నం భోజనంలో కోడిగుడ్లను ప్రతిరోజూ తీసుకుంటే చాలామంచిది. కోడిగుడ్డు నుండి మన శరీరం స్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ను తయారు చేసుకుంటుంది. ఎసెటిల్కోలైన్‌ దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది గనుక శరీరంలో లోపిస్తే ఆల్జిమర్స్‌ వ్యాధి వస్తుంది. 
 
అంతేగాకుండా న్యూరో ట్రాన్స్‌మీటర్స్‌ మన మేధో శక్తిని పెంచుతాయి. మెదడును ఉత్తేజపూరితం చేసి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మధ్యాహ్నం పూట ఆహారంలో పెరుగును తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే అమినో యాసిడ్లు ఒత్తిడిని తట్టుకునేందుకు దివ్య ఔషధాలుగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

తర్వాతి కథనం
Show comments